TS High Court: న్యూఇయర్‌ వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని

Published : 31 Dec 2021 14:23 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పబ్‌లు, బార్లలో వేడుకల సమయాన్ని మరింత పెంచారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దిల్లీ, మహారాష్ట్ర తరహాలో ఆంక్షలు విధించాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఇప్పటికే పోలీసులు మార్గదర్శకాలు జారీచేశారని గుర్తుచేసింది. పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయాలను తీసుకుంటాయని అభిప్రాయపడింది. రాష్ట్రంలో 100శాతం మొదటి డోసు పూర్తయిందని.. రెండో డోసు పంపిణీ కూడా 66 శాతం దాటిందని తెలిపింది. మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని