TTD: తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. నిలిచిన టికెట్ల బుకింగ్‌

తితిదే వెబ్‌సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయింది.

Updated : 24 Sep 2021 21:52 IST

తిరుమల: తితిదే వెబ్‌సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయింది. ఆన్‌లైన్‌లో టికెట్ల కొనుగోలుకు భారీగా భక్తులు యత్నించడంతో సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అక్టోబర్‌ నెలకు ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అక్టోబర్‌ 1 నుంచి 25 వరకు రోజుకు 8వేల టికెట్లు చొప్పున అందుబాటులో ఉంచింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఇదే తరహా సమస్య వచ్చింది. జియో సర్వర్‌తో అనుసంధానించినప్పటికీ తిరిగి మళ్లీ సాంకేతిక లోపం ఏర్పడింది. దీన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లపై తితిదే ప్రకటన చేసే అవకాశముంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని