Andhra News: ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్‌ ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖారాదైంది. మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ

Updated : 18 Mar 2022 20:00 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖారాదైంది. మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షలను మే 6 నుంచి నిర్వహిస్తున్నందున పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఇంటర్‌ పరీక్షలున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది.

పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

* ఏప్రిల్‌ 27 - తెలుగు

* ఏప్రిల్‌ 28 - సెకండ్‌ లాంగ్వేజ్‌

* ఏప్రిల్‌ 29 - ఇంగ్లిష్‌

* మే 2    -  గణితం

* మే 4    -  సైన్స్‌ పేపర్‌-1

* మే 5    -  సైన్స్‌ పేపర్‌-2

* మే 6    -  సాంఘిక శాస్త్రం

ఇంటర్‌ పరీక్షల తాజా షెడ్యూల్‌..

రాష్ట్రంలో మే 6 నుంచి 23 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఈ మేరకు తాజా షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని