Self Confidence: ఆత్మవిశ్వాసం పెంచుకునే మార్గాలు..!
ఆత్మవిశ్వాసం ఉండేలే గానీ.. దేన్నైనా సాధించగలమన్న నమ్మకం వస్తుంది. వ్యక్తిగత విషయాల్లో అయినా.. వృత్తిలో అయినా ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించగలరు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి,
ఇంటర్నెట్ డెస్క్: ఆత్మవిశ్వాసం ఉండేలే గానీ.. దేన్నైనా సాధించగలమన్న నమ్మకం వస్తుంది. వ్యక్తిగత విషయాల్లో అయినా.. వృత్తిలో అయినా ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించగలరు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, సవాళ్లను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ, కొంతమందిలో ఇదే లోపించి.. ఏ పనిని సరిగా చేయలేకపోతుంటారు. మరి అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే కొన్ని మార్గాలున్నాయి.
ఇతరులతో పోల్చుకోవద్దు
జీవితం పోటీ కాదు. ఎవరి జీవితాలు వారివి. ఒకరి స్థితిగతులు ఎలా ఉంటాయనేది వారి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి.. ఇతరులతో పోల్చి చూసుకోవడం మానేయాలి. ఇతరులతో పోల్చుకోవడం వల్ల అసూయ ఏర్పడుతుందట. దాని వల్ల వ్యక్తులు తమకు తాము తక్కువ చేసుకోవడంతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని గత పరిశోధనల్లో తేలింది.
మంచి మనుషులతో సాంగత్యం
మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామో.. గుర్తిస్తే మనమేంటో అర్థమవుతుంది. మంచి వ్యక్తులు.. సానుకూల దృక్పథంతో ఉండేవారు.. మన మంచి కోరే వారితో సన్నిహితంగా మెలగడం అలవాటు చేసుకోవాలి. వారి ప్రభావం మనపై కొంతైనా పడుతుంది. కాబట్టి వారి మాటలు, చర్యలు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఎవరైనా చెడువైపు లాగాలని ప్రయత్నిస్తే వారితో స్నేహానికి గుడ్‌బై చెప్పేయండి.
ఆరోగ్యమే మహాబలం
ఆరోగ్యం బాగుంటే.. కొండంత బలమే కాదు.. ఆత్మవిశ్వాసం కూడా లభిస్తుంది. నిత్యం హుషారుగా ఉండేవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటాన్ని గమనించొచ్చు. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం, పోషకాహారం తింటూ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోండి. దీని వల్ల క్రమంగా మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
తప్పులను మన్నించుకోండి
మీ వల్ల ఓ పొరపాటు జరిగితే దాన్నే తలుచుకుంటూ బాధపడాల్సిన అవసరం లేదు. మీ తప్పులను మీరే క్షమించుకోండి. మరోసారి అలా జరక్కుండా చూసుకోవాలని బలంగా సంకల్పించుకోండి. దీని వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఆ పదాలు నోటి వెంట రావొద్దు
నా వల్ల కాదు.. అసలు చేయగలమా?.. ఇది అసాధ్యం వంటి మాటలు మీ నోటి వెంట రాకుండా చూసుకోండి. అలాంటి మాటలు మిమ్మల్ని మరింత కుంగదీస్తాయి. దేన్నైనా నేను సాధించగలను అనే భావనతో ఉండాలి. నేను చేయగలను.. సాధించగలను అని మీకు మీరే తరచూ చెప్పుకుంటూ ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.
భయాలను ఎదుర్కోండి
ప్రతి మనిషికి భయాలు ఉంటాయి. కానీ, ఆ భయాలను జయిస్తేనే విజయాలు దక్కుతాయి. సవాలు ఎదురైతే భయపడి దాన్ని నుంచి తప్పుకునే ప్రయత్నం చేయొద్దు. సవాల్‌ను ఎదుర్కోండి. తొలి ప్రయత్నంలో ఓడినా భయం తొలగి.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తోంది. దీంతో భవిష్యత్తులో విజయాలను అందుకునే ఆస్కారముంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
గాల్లో అతి సమీపంలోకి వచ్చిన విమానాలు
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు