Tokyo Olympics: పసిడి పతకం తెస్తే ₹3 కోట్లు!

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించే క్రీడాకారులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. బంగారు పతకం సాధించిన విజేతలకు రూ.3 కోట్లు నగదు బహుమతి

Published : 27 Jun 2021 01:12 IST

చెన్నై: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించే క్రీడాకారులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. బంగారు పతకం సాధించిన విజేతలకు రూ.3 కోట్లు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు శనివారం వెల్లడించారు. రజతం సాధించిన క్రీడాకారులకు రూ.2 కోట్లు, కాంస్య పతకం సాధించినవారికి రూ.కోటి ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు తమిళనాడు నుంచి ఒలింపిక్ పతకాలు సాధించినవారి జాబితాలో చెన్నైకి చెందిన గగన్‌ నారంగ్‌ మాత్రమే ఉన్నారు. ఆయన 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో.. షూటింగ్‌ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో గగన్‌ కాంస్య పతకాన్ని సాధించారు. 

ఇంతకుముందు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కూడా ఒలింపిక్‌ క్రీడాకారులకు ఇదే తరహాలో నగదు బహుమతులు ప్రకటించారు. అంతర్జాతీయ వేదికలపై విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం ఇచ్చేందుకు నిర్ణయించారు. తద్వారా కొత్త ఆటగాళ్లకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన చేసిన వేదికల్లో 2012 లండన్‌ ఒలింపిక్స్‌ ప్రధానమైంది. అందులో భారత అథ్లెట్లు ఆరు పతకాలు సాధించి సత్తా చాటారు. ఇప్పటివరకు 14 క్రీడా విభాగాల్లో 102 మంది భారతీయ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.   

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని