Top 10 News @ 9AM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తల కోసం క్లిక్ చేయండి

Published : 29 Apr 2021 08:55 IST

1. లక్షణాలు కనిపిస్తే చాలు కొవిడ్‌ చికిత్స 

కొవిడ్‌ చికిత్సలో కీలక నిర్ణయమిది. ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష పాజిటివ్‌ నివేదిక ఉంటే కాని చేర్చుకునేది లేదంటున్న ఆసుపత్రులకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. చికిత్స ప్రారంభంలో జాప్యం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తే చాలు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల ఫలితం కోసం వేచిచూడకుండా సత్వరమే చికిత్సను ప్రారంభించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ఒక్కోచోట.. ఒక్కో రకం! 

కొవిడ్‌ సునామీలా విరుచుకుపడుతోంది. రెండో ఉద్ధృతిలో పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పది శాతంపైన పాజిటివ్‌ రేటుతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కొద్దిగా వెనకా ముందు అయినా మహమ్మారి అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. కేసులు ఎక్కువగా ఉన్న ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందని వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు అంటున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. భారత్‌కు యూఎస్‌ 100మి.డాలర్ల వైద్య సామగ్రి

రోనాపై పోరులో భారత్‌కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. భారత్‌కు వంద మిలియన్‌ డాలర్ల విలువైన వైద్య సామగ్రిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శ్వేతసౌధం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా వైద్య సామగ్రి సరఫరా చేసేందుకు కొనసాగుతున్న ప్రయత్నాల్ని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్‌ బుధవారం ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. బెంగాల్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం చివరి (8వ) దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా మొత్తం 35 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ సమయం ప్రారంభం కాగానే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నారు. 35 స్థానాల పరిధిలో 84.77 లక్షల ఓటర్లు ఉండగా.. 11,860 కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. రక్తం గడ్డకడితే ముప్పే

రోనా బాధితులు చాలామందిలో రక్తం గడ్డకట్టే గుణం కనిపిస్తోంది. కొవిడ్‌ నిర్ధారణ అయినప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటివారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని స్టార్‌ ఆసుపత్రికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ గూడపాటి రమేష్‌ హెచ్చరించారు. కరోనా బాధితులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మొదట ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని, ఆ తరవాత గుండె మీద అధిక ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. చెన్నై దంచేసింది

చెన్నై దంచేస్తోంది. గత ఐపీఎల్‌లో అనూహ్యంగా చతికిలపడ్డ సూపర్‌కింగ్స్‌ ఈసారి దూసుకెళ్తోంది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. మళ్లీ పాత చెన్నైలా మారిపోయింది. సన్‌రైజర్స్‌పై మామూలుగా రెచ్చిపోలేదు. హైలైట్స్‌ను చూసినట్లే బౌండరీల మోత. డుప్లెసిస్‌, రుతురాజ్‌ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ వేళ.. వార్నర్‌ బృందాన్ని చిత్తుగా ఓడించింది చెన్నై. 172 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌న ఊదేసింది. ధోనీసేన అయిదో విజయంతో పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానాన్ని అందుకుంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. పల్లెవిస్తున్న టీకాస్త్రం 

పల్లెలు కరోనాపై పోరుకు టీకాస్త్రాన్ని సంధిస్తున్నాయి. వైరస్‌ రూపంలో ఎదురొచ్చిన కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నాయి. గడిచిన వారం రోజుల్లో గ్రామాల్లో టీకాల కార్యక్రమం జోరందుకుంది. కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఇప్పటివరకు 5.10 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకుని స్ఫూర్తి చాటారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాలలో ఒకేరోజు 45 ఏళ్లు పైబడిన 718 మందికి టీకాలు వేశారు. గర్షకుర్తిలో 761 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. మనుషులనే కాదు.. మానవత్వాన్నీ చంపేస్తోంది!

కరోనా మహమ్మారి పలువురిని పొట్టన పెట్టుకుంటోంది. మరోవైపు వైరస్‌తో మృతిచెందినవారి అంతిమ సంస్కారాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. అప్పటి వరకూ వరుసతో పిలిచిన బంధువులు, పేరు పెట్టి పిలిచిన స్నేహితులు ముఖం చాటేస్తున్నారు. రాష్ట్రంలో ఒకేరోజు జరిగిన రెండు ఘటనలు ఇందుకు నిదర్శనం. బొలంగీర్‌ జిల్లా బలిడుంగురి గ్రామంలో మంగళవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. కష్టకాలంలో...కడుపునింపుతున్నారు!

ఇంట్లో అన్నీ ఉన్నాయి. కానీ ఏం లాభం? ఇంటిల్ల్లిపాదీ కొవిడ్‌ బారిన పడితే ఆప్యాయంగా వండిపెట్టేదెవరు? నేనున్నా అంటూ భరోసా ఇచ్చేదెవరు?  చేతిలో నాలుగు డబ్బులున్నవాళ్లు ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చేస్తారు... చేయడానికి పని లేక... తినడానికి తిండిలేక ఇబ్బందిపడే పేదాసాదా సంగతేంటి? సరిగ్గా ఇలాంటి వారికోసమే మేమున్నాం అంటూ మానవత్వానికి ఊపిరిలూదే ప్రయత్నం చేస్తున్న అమృతమూర్తులు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లకు తీవ్ర కొరత

‘కొవిడ్‌-19తో ప్రజలు చనిపోతున్న తీరు చూస్తే ప్రాణం ఉసూరుమంటోంది, సకాలంలో ఆక్సిజన్‌ ఇస్తే సగం మంది బతుకుతారు..’ ప్రస్తుతం పలువురు వైద్యుల అభిప్రాయమిది. తగినంతగా మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా లేక రోగులను చేర్చుకోడానికీ వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రుల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. సిలెండర్లు అద్దెకు తెచ్చుకుందామన్నా, దొరకడం లేదు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని