Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 19 Jan 2023 13:02 IST

1. Jacinda Ardern: న్యూజిలాండ్‌ ప్రధాని అనూహ్య ప్రకటన.. రాజీనామా చేసిన జెసిండా

న్యూజిలాండ్(New Zealand) ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌(Jacinda Ardern) అనూహ్య ప్రకటన చేశారు. రాజీనామా ప్రకటించి షాక్‌ ఇచ్చారు. ప్రగతిశీల పాలనకు పేరుపొందిన ఆమె.. ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. కరోనా కల్లోలం, అత్యంత దారుణస్థాయిలో జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె పాటించిన సంయమనం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇలాంటి ఆమె..తన రాజీనామాకు ఇదే తగిన సమయమని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Usain Bolt: ఉసేన్‌ బోల్ట్‌కు షాక్‌.. ఖాతా నుంచి రూ.103కోట్లు మాయం

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పరుగులు వీరుడు, జమైకా స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ (Usain Bolt) ఆర్థిక మోసం బారినపడ్డాడు. ఓ ప్రైవేటు పెట్టుబడుల సంస్థలో బోల్డ్‌కు ఉన్న ఖాతా నుంచి ఏకంగా 12.7 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.103కోట్లకు పైమాటే) మాయమయ్యాయి. ఆ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు నేరపూరిత కార్యకలాపాలకు (Financial Scam) పాల్పడి ఈ డబ్బు దోచుకున్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. Shubman Gill: ‘డబుల్‌’ గురించి ఆలోచించలేదు.. ఆ సిక్స్‌లతోనే నమ్మకం కలిగింది: గిల్‌

హైదరాబాద్‌లోని (Hyderabad) ఉప్పల్‌ (Uppal Stadium) మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అత్యంత పిన్న వయస్సులోనే (23 ఏళ్ల 132 రోజులు) డబుల్‌ సెంచరీ బాదిన భారత క్రికెటర్‌గా శుబ్‌మన్‌ గిల్‌ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో అదరగొట్టేసి 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. అద్భుతమైన పేస్‌ దళం కలిగిన కివీస్‌ను అడ్డుకొని ద్విశతకం బాదడం సాధారణ విషయం కాదు. తానేం చేయాలని భావించాడో... దాని కోసం వేచి చూసినట్లు శుబ్‌మన్‌ గిల్ తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
 

4. Budget 2023: మేడమ్‌..! ఇల్లు కట్టుకుంటాం కాస్త కరుణిస్తారా?

ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు బలపడుతున్నాయి. భౌగోళిక రాజకీయ అస్థిరతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ (Budget 2023)ను ప్రవేశపెట్టబోతోంది. పైగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌కు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ (Budget 2023). ఈ నేపథ్యంలో వివిధ రంగాలు కొత్త పద్దుపై ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్న అనేక మంది స్థిరాస్తి పరిశ్రమకిచ్చే ప్రోత్సాహకాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Harish Rao: కంటి వెలుగు.. ఈసారి ‘మేడ్ ఇన్ తెలంగాణ’ అద్దాల పంపిణీ: హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం ఖమ్మం వేదికగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ సహా దిల్లీ, పంజాబ్, కేరళ సీఎంల చేతుల మీదుగా కంటి వెలుగును బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పరీక్షలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట వివేకానంద కమ్యూనిటీ హాల్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. BJP: 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్టు నిరూపిస్తారా? కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌

ఖమ్మంలో బుధవారం జరిగిన భారాస(BRS) ఆవిర్భావ సభ అట్టర్ ఫ్లాప్‌ అయిందని భాజపా(BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay) విమర్శించారు. సభకు వచ్చిన జాతీయ నేతలకు.. వారెందుకు వచ్చారో కూడా తెలయదని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగంపై ఘాటు విమర్శలు చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వీడియో కోసం క్లిక్‌ చేయండి

7. Twitter: ట్విటర్‌లో మరిన్ని తొలగింపులు.. వేలంలో లోగో ప్రతిమకు రూ.81 లక్షలు

మరింత మంది ఉద్యోగులను తొలగించేందుకు (Layoffs) ట్విటర్‌ (Twitter) సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సంస్థ అధిపతి ఎలాన్‌ మస్క్‌ దాదాపు సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపిన విషయం తెలిసిందే. అప్పట్లో తొలగింపుల (Layoffs) ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇకపై ఎలాంటి ఉద్యోగుల కోతలు ఉండబోవని మస్క్‌ ప్రకటించారు. సరిగ్గా ఆరు వారాల తర్వాత మరింత మందిని తొలగించాలని (Layoffs) ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. IND vs NZ: ఇలా జరుగుతుందని ముందే ఊహించాం.. కానీ: రోహిత్ శర్మ

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో కివీస్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత శుబ్‌మన్‌ గిల్ (208) డబుల్ సెంచరీతో టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించగా.. మరోవైపు  బ్రాస్‌వెల్‌ (140) కూడా సెంచరీ కొట్టి కివీస్‌ను గెలిపించినంత పనిచేశాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Finance Ministry: ఆర్థిక శాఖ సమాచారం విదేశాలకు లీక్‌.. బడ్జెట్‌ వేళ కలకలం

వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ దేశ బడ్జెట్‌ (Budget 2023)ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధమవుతున్న వేళ.. ఈ మంత్రిత్వ శాఖ (Finance Ministry)లో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది. ఆర్థికశాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. అత్యంత రహస్య సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నట్లు దిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్‌ గుర్తించి అరెస్టు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Aparna Balamurali: అపర్ణా బాలమురళీతో స్టూడెంట్‌ అనుచిత ప్రవర్తన.. వీడియో వైరల్‌

‘సూరారై పోట్రు’ (Soorarai Pottru)తో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా బాలమురళీ (Aparna Balamurali)కి చేదు అనుభవం ఎదురైంది. ఓ కళాశాల ఈవెంట్‌లో పాల్గొన్న ఆమెతో ఓ స్టూడెంట్‌ అనుచితంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దానిని చూసిన పలువురు నెటిజన్లు ఆ యువకుడి ప్రవర్తనను తప్పుబడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు