Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Aug 2021 13:19 IST

1. Afghanistans Ghost Soldiers: అఫ్గాన్‌లో ‘ఆత్మ’లను నమ్ముకున్న అమెరికా..!

రాజు గారు దేవతా వస్త్రం ధరించి వీధుల్లో ఊరేగితే పరాభవం జరిగినట్లే ఉంది అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి. అఫ్గాన్‌ ప్రభుత్వం వద్ద 3,00,000 మందికి పైగా సైన్యం ఉన్నారని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పగటికలలు కంటూ వాటి శక్తిని అభివర్ణించి ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యారు. అఫ్గాన్‌ సైన్యంలో ఉన్న అవినీతి దళం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో..! దేశభద్రతను తాకట్టు పెట్టి మరీ అవినీతికి పాల్పడ్డారు.. వారు చేసిన అక్రమాల ఫలితం ఇప్పుడు అఫ్గాన్‌ సామాన్య ప్రజలు అనుభవిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కాబూల్‌ విమానాశ్రయంలో తొక్కిసలాట: ఏడుగురి మృతి

2. Pay 1/3rd Card: ఇదీ ఓ రకం క్రెడిట్‌ కార్డే.. కానీ, 3 నెలల వరకు వడ్డీ ఉండదు!

 ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ యూని వివిధ రకాల క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెడుతోంది. తాజాగా ‘పే వన్‌ థర్డ్‌’(Pay 1/3rd) అనే సరికొత్త కార్డును తీసుకొచ్చింది. దీన్ని ‘పే లేటర్‌’ కార్డుగా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా కార్డును భారత్‌లో విడుదల చేయడం ఇదే తొలిసారి. భారత్‌లో అత్యధిక కాలం వడ్డీరహిత నగదు సదుసాయాన్ని అందిస్తున్న కార్డుగా దీన్ని పేర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Artificial intelligence: ఊపిరితిత్తుల క్యాన్సర్లను గుర్తించే కృత్రిమ మేధ

ఊపిరితిత్తుల క్యాన్సర్లను 90 శాతానికి పైగా కచ్చితత్వంతో గుర్తించే ఒక కృత్రిమ మేధ (ఏఐ) విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దాదాపు 800 మందిపై జరిపిన పరిశోధనలో ఇది తన సత్తాను చాటింది. క్యాన్సర్‌ మరణాలకు ప్రధాన కారణం ఊపిరితిత్తుల క్యాన్సరే. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మందికిపైగా బలవుతున్నారు. ఈ వ్యాధిని గుర్తించేందుకు వాడే ‘లో డోస్‌ కంప్యూటెడ్‌ టొమోగ్రఫీ స్క్రీనింగ్‌’ పరీక్షను ఎక్కువ మంది చేయించుకోవడంలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: కరోనా వేళ అప్పు తీసుకున్న వాళ్లు ఎంతమందో తెలుసా?

4. Petrol Prices: స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ఎంతంటే?

దాదాపు గత నెలరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గడం విశేషం. లీటర్‌ పెట్రోల్‌పై 14పైసలు, డీజిల్‌పై 18 పైసలు తగ్గించారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.69, డీజిల్‌ ధర రూ.97.15కు చేరింది. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడంతో దేశీయ విక్రయ సంస్థలు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్స్ఛేంజీలో అక్టోబర్‌ కాంట్రాక్టుకు బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 66.72 డాలర్లుగా పలుకుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. IND vs ENG: ఇంగ్లాండ్‌పై పరుగుల వరద పారించిన భారత ఆటగాళ్లు వీరే..

భారత్, ఇంగ్లాండ్ రెండు మేటి జట్లే. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా ఏ విభాగంలో చూసినా పటిష్ఠంగా ఉంటాయి. ఈ ఇరు జట్లు తలపడితే అభిమానులకు పండగే. అదీ సుదీర్ఘ ఫార్మాట్ అయితే ఆ మజా మరింత పెరుగుతుంది. ప్రస్తుతం టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఆంగ్లేయ జట్టుపై టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లెవరో  తెలుసుకుందాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* INDvsENG: ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల నోటి దురుసు.. టీమ్‌ఇండియా విజయ పరంపర

6. రోల్స్‌ రాయిస్‌... అందరికి అమ్మరు

నిజమే... ‘మాకు డబ్బు కన్నా కారే ముఖ్యం’ అనే ప్రమాణాన్ని మొదటినుంచీ పాటిస్తున్న రోల్స్‌రాయిస్‌ సంస్థ అడిగిన వాళ్లందరికీ తమ కారును అమ్మదు. కారును బుక్‌చేసుకున్న కస్టమరు వ్యక్తిగత ప్రొఫైల్‌, సమాజంలో అతని స్థాయి, దాన్ని నడపబోయే డ్రైవరు వివరాలు... ఇలా అన్నింటినీ చూస్తుంది. అందుకే ఈ కారు కొనాలంటే డబ్బుతోపాటూ అదృష్టం కూడా ఉండాలని అంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Corona Vaccine: వ్యాక్సిన్‌ తీసుకోని వారిపై బ్లాక్‌ఫంగస్‌ పంజా!

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోని వారిలో బ్లాక్‌ఫంగస్‌ ముప్పు పెరిగినట్లు తేలింది. అలాగే పలువురు బాధితుల్లో డెల్టా వేరియంట్‌ లక్షణాలు కనిపించాయి. ఒక డోసు కూడా వ్యాక్సిన్‌ పొందనివారు, రోగనిరోధక శక్తి తగ్గి చక్కెర వ్యాధి కలిగి రక్తంలో ఇనుము శాతం ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ మంది బ్లాక్‌ఫంగస్‌ బారినపడ్డారు. ఈనెల 10నాటికి రాష్ట్రవ్యాప్తంగా 4,609 బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 432 మంది చనిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* India Corona : 31 వేల కేసులు..  38 వేల రికవరీలు

8. Drugs: పొట్టలో భారీగా డ్రగ్స్‌.. ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న భద్రతా సిబ్బంది

బెంగళూరు విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి పొట్టలో రూ.11కోట్ల విలువైన కొకైన్‌ ఉంచినట్లు విమానాశ్రయ భద్రతా సిబ్బంది గుర్తించారు. దుబాయ్‌ నుంచి బెంగళూరు వచ్చిన సదరు వ్యక్తి విమానంలో ఆహారం, నీరు తీసుకోకపోవడంతో అతడిపై భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని స్కాన్‌ చేయగా పొట్టలో భారీగా కొకైన్‌ ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. RamCharan: అప్పాతో ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను

తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవికి రామ్‌చరణ్‌ స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘ఆచార్య’ షూట్‌లో భాగంగా తన తండ్రితో గడిపిన ప్రతి క్షణాన్నీ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ‘ఆచార్య’ షూట్‌కు సంబంధించిన ఓ చిన్న గ్లిమ్స్‌ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. ‘నేను అప్పా అని ప్రేమగా పిలిచే మా ఆచార్యతో గడిపిన ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెర్రీ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్‌ వచ్చేసింది!

10. మల్లన్నసాగర్‌ స్వప్నం సాకారమైంది.. కేసీఆర్‌ కల నెరవేరింది: హరీశ్‌రావు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన భారీ రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌ ట్రయల్‌ రన్‌ ప్రారంభమైంది. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా కాళేశ్వరం కాలువ నుంచి నీటిని జలాశయంలోకి మళ్లిస్తున్నారు. దీనిపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ కల నెరవేరిందని ట్వీట్‌ చేశారు. మల్లన సాగర్‌ స్వప్నం సాకారం అయిందన్న మంత్రి.. తెలంగాణ రైతులు ఆనందంతో మురిసిపోతున్నారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు