Updated : 30 Aug 2021 13:20 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Afghanistan: ‘తాలిబన్లను చూసి భ..భ..భయపడొద్దు..!’

‘‘తాలిబన్ల ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ప్రభుత్వాన్ని చూసి అఫ్గానిస్థాన్‌ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు’’ అఫ్గాన్‌లోని ఓ టీవీ యాంకర్‌ చెప్పిన మాటలివి. కానీ, అవి చెబుతున్నప్పుడు ఆయన భయంతో వణికిపోయారు. అవును మరీ.. ఎందుకంటే అవి ఆయన సొంతంగా చెప్పిన మాటలు కావు.. తాలిబన్లు తుపాకీ గురీ పెట్టి మరీ చెప్పించిన మాటలు. ఓ టీవీ స్టూడియోలోకి చొరబడిన ముష్కరులు అక్కడి యాంకర్‌ను బెదిరించి తాలిబన్లకు అనుకూలంగా ప్రకటన ఇప్పించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Afghanistan: కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద మళ్లీ రాకెట్ల వర్షం..!

2. Paralympics: ఒక్కరోజే 4 పతకాలు.. పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట

టోక్యో పారాలింపిక్స్‌లో భారతీయులు దుమ్మురేపుతున్నారు. అద్భుతమైన ప్రదర్శనలతో పతకాల పంట పడిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు పతకాలు కొల్లగొట్టారు. అందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం ప్రత్యేకం. షూటింగ్‌లో అవనీ లేఖరా పసిడి ముద్దాడగా దేవేంద్ర జజారియా, యోగేశ్‌ కతునియా రజతాలు కైవసం చేసుకున్నారు. సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ కాంస్యంతో మురిపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Crime News: వాగులో కొట్టుకుపోయిన కార్ల ఘటన.. 3 మృతదేహాల గుర్తింపు

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో తిమ్మాపూర్‌ వాగు దాటబోతూ దాని ఉద్ధృతికి కారులో కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించి రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వధువు ప్రవల్లిక, వరుడి సోదరి శ్రుతి మృతదేహాలను గుర్తించారు. డ్రైవర్‌ రాఘవేందర్‌రెడ్డి, బాలుడు త్రిషాంత్‌ మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మరోవైపు శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి వాగులో కోట్టుకుపోయిన కారులో ఉన్న వృద్ధుడు వెంకటయ్య(70) మృతదేహం కూడా లభ్యమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Love: మేనత్తతో యువకుడి ప్రేమాయణం.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి..

మధ్యప్రదేశ్‌లోని సిహావల్‌ మండలంలో ఓ యువకుడు తనకన్నా పెద్దదైన మేనత్తను ప్రేమించాడు. ఆమె కూడా ఇష్టపడింది. వారి మధ్య ప్రేమాయణం ఓ ఏడాది కాలం నడిచింది. ఈ క్రమంలోనే అత్త గర్భం దాల్చింది. ఆమెకు ఆరో నెల వచ్చేసరికి.. వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ వారు ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. వంతెన పై నుంచి దూకి అత్మహత్య చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Fixed Deposit: ఇవి గమనించకుండా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా?

భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన పెట్టుబడి సాధనం ఫిక్స్‌డ్‌ డిపాజిట్(ఎఫ్‌డీ)‌. బ్యాంకుల్లో ఒక నిర్దేశిత కాలం సొమ్ము ఉంచడాన్ని సురక్షితంగా భావించడంతో పాటు అదనంగా వడ్డీ వస్తుండడంతో చాలా మంది దీనిపై మొగ్గు చూపుతుంటారు. మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌, ఈక్విటీ- పెట్టుబడి పెట్టడానికి ఇలా చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. కొంతమంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వైపే మొగ్గుచూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీ చేసే ముందు పరిశీలించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్ని చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

SBI Home Loan: హోం లోన్ తీసుకుంటారా? మరి ఈ ఆఫర్‌ రేపటితో ముగియనుంది!

6. Atchannaidu: జగన్‌.. ఉత్తరాంధ్రకు ఏం చేశారు?: అచ్చెన్నాయుడు

ఉత్తరాంధ్ర సమస్యలను ఈ ప్రాంత మంత్రులు సీఎం జగన్‌ వద్ద ప్రస్తావించగలరా? అని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన ‘ఉత్తరాంధ్ర రక్షణ- చర్చా వేదిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌పై గతంలో వైకాపా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని.. కరోనా సమయంలో అదే ప్రజల ప్రాణాలు కాపాడిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Corona: 40వేలపైనే కొత్త కేసులు.. 70శాతం ఒక్క కేరళలోనే..

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 40వేల పైనే ఉంటున్నాయి. దీంతో క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 42,909 కొత్త కేసులు బయటపడ్డాయి. కాగా.. ఇందులో దాదాపు 70శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Sridevi Soda Center: అరే..! మంచి సన్నివేశాన్ని తొలగించారే

సినిమా నిడివి ఎక్కువయ్యే నేపథ్యంలో బాగున్న సన్నివేశాల్నీ తొలగించాల్సి వస్తుంది. అవే ‘డిలీటెడ్‌ సీన్స్‌’గా అలరిస్తుంటాయి. వాటిని చూసిన తర్వాత ‘అరే..! మంచి సన్నివేశాన్ని తొలగించారే’ అని అనుకోవాల్సిందే. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ విషయంలోనూ ఇదే జరిగింది. సుధీర్‌బాబు కథానాయకుడిగా కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. ఆనంది కథానాయిక. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Radheshyam: పూజాహెగ్డేకి పియోనో నేర్పిస్తున్న ప్రభాస్‌..!

9. Torture: వ్యక్తిని చితకబాది.. ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లి..

ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాది, తాళ్లతో కట్టి ట్రక్కుతో ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ నీమచ్‌ జిల్లాలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సింగోలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ గ్రామానికి చెందిన కన్హయలాల్‌ భీల్‌(40) సింగోలీ- నీమచ్‌ ప్రధాన రహదారిపై గత గురువారం నిలుచుని ఉన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Bandi Sanjay: ప్రధాని ఆవాస్‌ యోజన జాబితా ఎందుకివ్వట్లేదు?: బండి సంజయ్‌

తెలంగాణ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం పేరును తెరాస ప్రభుత్వం మార్చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే డబుల్ బెడ్‌రూం ఇళ్లు కడుతున్నారని.. ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే పథకం పేరును మార్చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. కాంట్రాక్టర్ల కమిషన్‌ కోసమే ఇళ్లు కడుతున్నారని.. నాణ్యతను ఇప్పటి వరకు సీఎం పరిశీలించలేదని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని