Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 May 2022 13:15 IST

1. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్‌ పాదయాత్ర?

పార్టీకి పూర్వవైభవమే లక్ష్యంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘నవసంకల్ప చింతన శిబిరం’లో మరో కీలక ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా భారీ పాదయాత్ర నిర్వహించాలని ఓ కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతూ ఈ పాదయాత్రను కొనసాగించాలని ‘సస్టెయిన్డ్‌ అజిటేషన్‌ కమిటీ’ ప్రతిపాదించినట్లు ఈ సమావేశాల్లో పాల్గొంటున్న ఓ సీనియర్‌ నాయకుడు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధం: తలసాని

కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నారని ఇష్టారీతిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఉద్దేశించి తలసాని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కిమ్‌ రాజ్యంలో కరోనా స్వైరవిహారం

ఉత్తరకొరియాలో కరోనా మహమ్మారి (North Korea COVID-19 Outbreak) స్వైరవిహారం చేస్తోంది. దాదాపు రెండేళ్ల పాటు వైరస్ ఆనవాళ్లు లేవని చెప్పుకున్న రాజ్యం ఇప్పుడు మహమ్మారి (Pandemic) వ్యాప్తితో ఉక్కిరిబిక్కిరవుతోంది. శనివారం మహమ్మారికి మరో 15 మంది బలైనట్లు ఆ దేశ అధికారిక మీడియా ‘కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (KCNA)’ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 42 మంది ప్రాణాలు కోల్పాయారు. కొత్తగా 2,96,180 మందిలో వైరస్‌ లక్షణాలతో కూడిన జ్వరాలను గుర్తించినట్లు కేసీఎన్‌ఏ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల రెగ్యులరైజ్‌.. పోస్టుల మంజూరు

తెలంగాణలోని 38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు వేగంగా న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్కారు ప్రకటించింది. దీనికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ని కోరింది. రెగ్యులరైజ్ చేసిన కోర్టుల్లో 22 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి క్యాడర్‌వి కాగా.. మరో 16 సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్‌కు చెందినవి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పాత మెనూ, హోం స్క్రీన్‌ బోర్ కొట్టేశాయా..? వీటితో మొబైల్ లుక్‌ మార్చేయండి!

స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్‌ఫేస్‌ కొత్తగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు చాలా మంది నుంచి వినిపించే సమాధానం.. వాల్‌పేపర్స్‌ లేదా హోమ్‌ స్క్రీన్‌ థీమ్‌ మార్చుకోమని సూచిస్తుంటారు. అయితే ఫోన్‌ పనిచేసేందుకు ఉపయోగించే ఓఎస్‌ మాత్రం పాతదే ఉంటుంది. దీంతో ఎన్నిసార్లు వాల్‌పేపర్లు, థీమ్‌లు మార్చినా కొత్త అనుభూతి రాదు. అయితే ఫోన్‌లో పాత ఇంటర్‌ఫేస్‌తోపాటు, యాప్స్‌, ఫోన్‌ పనితీరులో మీకు నచ్చినట్లుగా మార్పులు చేసుకునేందుకు ఆండ్రాయిడ్ యూజర్లకు లాంచర్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మరుగుజ్జు పెళ్లి కోసం పోలీసులకు మళ్లీ ఫిర్యాదు

పిల్ల దొరికినా పెళ్లి చేయటం లేదంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం శామ్లీకి చెందిన మరుగుజ్జు యువకుడు అజీం మన్సూరీ (26) తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది క్రితం ఇదే ఫిర్యాదుతో అజీం వార్తల్లో నిలవగా.. గాజియాబాద్‌కు చెందిన రెహానా అనే మరుగుజ్జు యువతి ముందుకొచ్చింది. అయినా ఇంట్లోవాళ్లు పెళ్లి చేయకపోవటంతో సహనం చచ్చిన అజీం మళ్లీ పోలీస్‌స్టేషను మెట్లు ఎక్కాడు. మూడడుగుల పొడవు ఉన్న అజీం..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గుంటూరు జిల్లాలో దారుణం.. బధిర యువతిపై అత్యాచారం!

ఏపీలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఘోరాలు జరుగుతునే ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో బధిర యువతిపై అత్యాచారం జరిగింది. జకరయ్య అనే వ్యక్తి దారుణానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఆరోపించింది. శనివారం మధ్యాహ్నం దురాగతానికి ఒడిగట్టారని చెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు తెనాలి త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. KGF3 : కేజీయఫ్‌-3పై నిన్న అలా.. నేడు ఇలా..!

‘కేజీయఫ్‌’, ‘కేజీయఫ్‌-2’ చిత్రాలతో కన్నడ చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చేర్చారు నటుడు యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌నీల్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇటీవల విడుదలైన ‘కేజీయఫ్‌-2’ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘కేజీయఫ్‌’లో వదిలేసిన ఎన్నో ప్రశ్నలకు ‘కేజీయఫ్‌-2’తో దర్శకుడు సమాధానాలిచ్చారు. అయితే, ‘కేజీయఫ్‌-2’ ఎండ్‌కార్డ్స్‌లో ‘కేజీయఫ్‌-3’ ఉన్నట్లు చిత్రబృందం చిన్న హింట్‌ ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఇక లేనట్లే.. కారణాలేంటంటే..?

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ లీగ్‌ స్టేజ్‌ ముగింపు దశకు చేరుకునే క్రమంలో హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. సాంకేతికంగా ఇంకా అవకాశం ఉన్నా.. అది చాలా కష్టమే. గతరాత్రి కోల్‌కతాతో ఓటమి తర్వాత 10 పాయింట్లతోనే నిలిచిన హైదరాబాద్‌ ఈసారి కూడా ప్లేఆఫ్స్‌ చేరకుండా ఇంటిముఖం పట్టే వీలుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు వైఫల్యానికి గల కారణాలేంటంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మహిళా న్యాయవాదిపై అమానుష దాడి.. పదే పదే కాలితో తన్నుతూ..

మహిళా న్యాయవాదిపై ఓ వ్యక్తి  విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. బాగల్‌కోట్‌లో మహిళ న్యాయవాదిగా పనిచేస్తున్న సంగీత షిక్కారిపై మహంతేశ్ అనే వ్యక్తి అమానుషంగా దాడి చేశాడు. మహిళ కడుపుపై.. పదే పదే కాలితో తన్నుతూ ఉన్మాదిలా ప్రవర్తించాడు. అడ్డొచ్చిన ఆమె భర్త పైనా నిందితుడు దాడి చేశాడు. దీంతో ప్రస్తుతం వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని