Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Jan 2023 13:23 IST

1. సర్కారు వారి పాట.. ఈసారి కాస్త నెమ్మదే!

జాతీయీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు.. ఇదంతా ఒకప్పటి మాట. ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ (Disinvestment) ఇది ఇప్పటి మాట. సరళీకరణ ఆర్థిక విధానాలు మొదలైనప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం వీటినే అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఇంకాస్త దూకుడు వ్యవహరిస్తూ వచ్చింది. దీంతో విపక్షాలు ఈ విషయంలో కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తున్నాయి. ‘బేచో ఇండియా’ కార్యక్రమాన్ని చేపట్టిందంటూ మోదీ సర్కారును విమర్శిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘వాల్తేరు వీరయ్య’ రేటింగ్స్‌పై చిరంజీవి జోకులు

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)కు పలు వెబ్‌సైట్స్‌ ఇచ్చిన రేటింగ్స్‌పై మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) జోకులు వేశారు. ఎవర్నీ విమర్శించాలనే ఉద్దేశంతో తాను ఈ జోకులు వేయడం లేదని.. కేవలం సరదాగానే చెబుతున్నానని అన్నారు. ‘‘వాల్తేరు వీరయ్య’ యూఎస్‌ ప్రీమియర్స్‌ చూసి ఇక్కడ పలు వెబ్‌సైట్స్‌లో సినిమా రివ్యూలు రాశారు. పలువురు ఈ చిత్రానికి 2.5 రేటింగ్‌ ఇచ్చారు. వాటిని చూసి.. బాధపడకూడదని అనుకున్నాను. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ వగీర్‌..!

భారత నౌకాదళం(Indian Navy)లోకి మరో జలాంతర్గామి చేరింది. ఐఎన్‌ఎస్‌ వగీర్‌(INS Vagir)ను నౌకాదళానికి అప్పగించే కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ పాల్గొన్నారు. ‘‘ఈ సబ్‌మెరైన్‌తో భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడతాయి. దేశ ప్రయోజనాలను ఇది శత్రువుల నుంచి కాపాడుతుంది. అంతేకాదు.. సంక్షోభ సమయంలో కీలకమైన నిర్ణయాత్మకమైన ఇంటెలిజెన్స్‌, నిఘా, పర్యవేక్షణలను అందిస్తుంది’’ అని నౌకాదళం ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఘనంగా రాహుల్‌-అతియా పెళ్లి ఏర్పాట్లు.. సాయంత్రం మీడియా ముందుకు కొత్త జంట

భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) పెళ్లికి సర్వం సిద్ధమైంది. తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి కుమార్తె, నటి అతియాశెట్టి (Athiya Shetty) మెడలో ఆయన నేడు మూడుముళ్లు వేయనున్నారు. మహారాష్ట్ర, ఖండాలలోని సునీల్‌శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో సాయంత్రం నాలుగు గంటలకు వీరి వివాహం జరగనుంది. కుటుంబసభ్యుల సమక్షంలో జరగనున్న ఈ పెళ్లి వేడుకకు కేవలం వంద మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘జాబ్‌ లేదు.. వీసా టైం ఆగదు’: అమెరికాలో భారతీయులకు కొత్త సవాళ్లు..!

అమెజాన్‌లో పనిచేస్తున్న గీత(పేరు మార్చాం) మూడు నెలల క్రితమే అమెరికా (US)లో అడుగుపెట్టింది. ఇటీవల లేఆఫ్‌ల్లో భాగంగా మార్చి 20 ఆమె చివరి వర్కింగ్‌ డే అని చెప్పారు. హెచ్‌-1బీ వీసాతో అగ్రరాజ్యానికి వెళ్లిన ఆమె.. ఇప్పుడు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిందే. లేదంటే స్వదేశానికి తిరిగివెళ్లడం తప్ప మరో అవకాశం లేదు. అమెరికా (America)లో ఉంటున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇది..! ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు అమెరికాలోని టెక్‌ కంపెనీలు కోతల బాటపట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమెరికాలో కాల్పుల ఘటన.. అనుమానితుడి ఆత్మహత్య!

అమెరికా(USA)లోని మాంటెరీ పార్క్‌(Monterey Park)లో బాల్‌రూమ్‌ డ్యాన్స్‌ స్టూడియోలో మారణహోమానికి పాల్పడినట్లు భావిస్తున్న వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. షాట్‌గన్‌తో తనకు తానే కాల్చుకున్నట్లు అతడి శరీరంపై గాయం ఉందని పోలీసులు చెప్పారు. అనుమానితుడు చైనా నుంచి వలస వచ్చిన హూ కాన్‌ ట్రాన్‌ (72)గా గుర్తించారు. ట్రాన్‌ కాల్పులకు పాల్పడిన తర్వాత కొందరు వ్యక్తులు అతడి ఆయుధాన్ని లాక్కొన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాపం పసివాళ్లు

అభం శుభం తెలియని పసివాళ్లు.. వేలుపట్టుకుని నడిపించాల్సిన తండ్రి మధ్యలోనే వదిలేసి తన దారి చూసుకున్నాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి మరొకరితో కొనసాగిస్తున్న సహజీవనానికి అడ్డొస్తున్నారని పిల్లల్ని ఊరుకానీ ఊరిలో వదిలేసింది. ఎందుకు వదిలేశారో తెలియని పసితనం. తమ భవిష్యత్తు ఏమిటో తెలియని అమాయకత్వంతో దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న ఆ పిల్లల్ని ట్రాఫిక్‌ పోలీస్‌ చొరవతో సంరక్షణ కేంద్రానికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సంక్రాంతి తర్వాత సందడి.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

జనవరి చివరి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి కొత్త సినిమాలు అడుగుపెడుతున్నాయి. జనవరి 25: షారుఖ్‌ఖాన్‌- దీపిక పదుకొణె.. ‘పఠాన్‌’. జనవరి 26: సుధీర్‌బాబు ‘హంట్‌’, గాంధీ.. గాడ్సే ఏక్‌ యుధ్‌, సిందూరం, మాలికాపురం. ఓటీటీ-  జనవరి 27: 18 పేజెస్‌(ఆహా), షాట్‌గన్‌ వెడ్డింగ్‌(అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో). జనవరి 26:  జాన్‌బాజ్‌ హిందుస్థాన్‌ కీ(జీ5), డియర్‌ ఇష్క్‌(డిస్నీ+హాట్‌స్టార్‌). జనవరి 25: ఎక్స్‌ట్రార్డినరీ (డిస్నీ+హాట్‌స్టార్‌). జనవరి 24: బ్లాక్‌ షన్‌షైన్‌ బేబీ(నెట్‌ఫ్లిక్స్‌). జనవరి 23: నార్విక్‌(నెట్‌ఫ్లిక్స్‌). పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రిషభ్‌ పంత్‌ కోలుకోవాలని.. క్రికెటర్ల పూజలు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమ్‌ఇండియా క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ కోసం తోటి ఆటగాళ్లు సూర్య కుమార్ యాదవ్, కుల్‌దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్‌ పూజలు చేశారు. పంత్‌ త్వరగా కోలుకోవాలని మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఉజ్జయిని ఆలయంలో వీరంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూజిలాండ్‌తో మూడో వన్డే నిమిత్తం టీమ్‌ఇండియా జట్టు మధ్యప్రదేశ్ చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున సూర్యకుమార్‌, కుల్‌దీప్‌, సుందర్‌తో పాటు భారత క్రికెట్‌ జట్టు స్టాఫ్‌ ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కుటుంబ ‘బడ్జెట్‌’కు బీమా భరోసా!

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కుటుంబ బడ్జెట్‌లో బీమా (Insurance) సంబంధిత ఖర్చులు కీలకంగా మారాయి. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో సామాన్యులు కొత్త బడ్జెట్ (Budget 2023) నుంచి బీమా (Insurance) సంబంధిత ఉపశమనాలను ఆశిస్తున్నారు. బీమా పరిశ్రమ కూడా సామాన్యులకు ప్రయోజనాలను అందించాలని కోరుతోంది. ఫలితంగా పరిశ్రమ వృద్ధి చెంది సామాన్య ప్రజలకు బీమా పథకాలు అందుబాటులోకి వస్తాయని చెబుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని