Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 04 Nov 2023 17:07 IST

1. KTR: కాంగ్రెస్‌లో సీఎంలు దొరికారు.. ఓటర్లే దొరకడం లేదు: మంత్రి కేటీఆర్‌

కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. జలవిహార్‌లో ఏర్పాటు చేసిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్వొకేట్‌ ట్రస్ట్‌ను రూ.500 కోట్లకు పెంచుతాం, న్యాయవాదులకు వైద్య బీమాను కూడా పెంచుతామని ప్రకటించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల సేవలను కొనియాడారు. విద్యార్థులతో సమానంగా న్యాయవాదులు పోరాడారని కితాబిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Raja Singh: బుల్లెట్‌పై వచ్చి నామినేషన్ దాఖలు చేసిన రాజాసింగ్‌

గోషామహల్‌ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రాజాసింగ్‌ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి ఎలాంటి ఆర్భాటం లేకుండా.. బుల్లెట్‌పై వచ్చి అబిడ్స్‌లోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. రాజాసింగ్‌ వెంట పెద్ద ఎత్తున వచ్చిన భాజపా నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో.. నలుగురితో కలిసి అబిడ్స్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Mukesh Ambani: ముకేశ్ అంబానీకి బెదిరింపుల కేసు.. నిందితుడి అరెస్ట్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani)కి ఇటీవల వరుసగా బెదిరింపు మెయిల్స్‌ (Threat Mails) వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు (Mumbai Police) ఓ నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడిని 19 ఏళ్ల గణేశ్‌ రమేశ్‌ వనపర్దిగా గుర్తించిన పోలీసులు.. అతడిని తెలంగాణ (Telangana) నుంచి అరెస్టు చేసినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Adinarayana Reddy: పురందేశ్వరిపై ఆరోపణలు చేసే అర్హత విజయసాయిరెడ్డికి లేదు: ఆదినారాయణరెడ్డి

భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఆరోపణలు చేసే అర్హత వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి లేదంటూ మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) తీవ్రంగా మండిపడ్డారు. విజయసాయిరెడ్డి బంధువులకు మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్న మాట వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Nara Lokesh : కరవుపై చర్చించని మంత్రివర్గ సమావేశమెందుకు..?: లోకేశ్‌

జగన్‌ ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌  మండిపడ్డారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంపై విమర్శలు గుప్పించారు. కరవుపై చర్చించని మంత్రివర్గ సమావేశం ఎందుకని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Election Commission: పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా సీఈసీ కొత్త విధానం

పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్లను పోలింగ్ కంటే ముందే ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సిబ్బందితోపాటు అత్యవసర సేవలు, ఎన్నికల విధుల్లో పాల్గొనే మరో 13 కేటగిరీలకూ ఈసీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Election Duty: నాకు పెళ్లి చేస్తేనే.. ఎన్నికల విధులకు వస్తా!

మధ్యప్రదేశ్‌ ఎన్నికల (Madhyapradesh Elections) నేపథ్యంలో ఓ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల శిక్షణా తరగతులకు హాజరుకావాలన్న అధికారుల ఆదేశాలను విస్మరించడమే కాకుండా, షోకాజ్‌ నోటీసులో ఆయన ఇచ్చిన వివరణ ఉన్నతాధికారులు ఆగ్రహానికి గురి చేసింది. నిర్లక్ష్య వైఖరి సరికాదంటూ జిల్లా కలెక్టర్‌ అతడిని సస్పెండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. OnePlus: వన్‌ప్లస్‌ దీపావళి ఆఫర్‌.. ఈ ఫోన్‌పై ₹14 వేలు డిస్కౌంట్‌

చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (OnePlus) దీపావళి సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్స్‌, టీవీలపై స్పెషల్‌ డిస్కౌంట్లు అందిస్తోంది. కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్లపై ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్లు, నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ సేల్‌ ఇప్పటికే ప్రారంభమైంది. నవంబర్‌ 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు వన్‌ప్లస్‌ ఫోన్‌ కోసం చూస్తున్న వారైతే ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ODI WC 2023: భారత బౌలర్ల నుంచి నేర్చుకోకుండా ఎందుకీ నెగిటివిటీ?: వసీమ్ అక్రమ్‌

వరల్డ్ కప్‌లో భారత పేసర్లు రెండు వైపులా స్వింగ్‌ చేయడంపై తమ మాజీ క్రికెటర్‌ హసన్‌ రజా చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్‌ పేస్‌ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌ తోసిపుచ్చాడు. సీమ్‌, స్వింగ్‌ రాబట్టడానికి భారత్‌  విభిన్న బంతులను వాడుతోందని హసన్‌ రజా వ్యాఖ్యానించాడు. గత రెండు రోజులుగా తాను కూడా ఇలాంటి మాటలను వింటూ ఉన్నానని.. ఇదంతా చెత్త డిబేట్‌గా అక్రమ్‌ పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Smriti Irani: బెట్టింగ్‌ యాప్‌ నుంచే కాంగ్రెస్‌ ప్రచారానికి నిధులు: స్మృతి ఇరానీ

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సంచలన విషయం వెల్లడించింది. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ (Bhupesh Baghel)కు రూ.508 కోట్లు చెల్లింపులు జరిగినట్లు గుర్తించింది. దీంతో ఈ అంశం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సీఎం బఘేల్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని