OnePlus: వన్‌ప్లస్‌ దీపావళి ఆఫర్‌.. ఈ ఫోన్‌పై ₹14 వేలు డిస్కౌంట్‌

OnePlus Diwali offers: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్‌ దీపావళి సేల్‌ని ప్రారంభించింది. ఇందులో వన్‌ప్లస్‌ ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్‌, నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది.

Published : 04 Nov 2023 14:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (OnePlus) దీపావళి సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్స్‌, టీవీలపై స్పెషల్‌ డిస్కౌంట్లు అందిస్తోంది. కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్లపై ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్లు, నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ సేల్‌ ఇప్పటికే ప్రారంభమైంది. నవంబర్‌ 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు వన్‌ప్లస్‌ ఫోన్‌ కోసం చూస్తున్న వారైతే ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి..

దీపావళి సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ వన్‌ప్లస్‌ ఓపెన్‌ (OnePlus Open)పై ఆకర్షణీయమైన తగ్గింపును ఇస్తోంది. రూ.5 వేలు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌, 12 నెలల పాటు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. ఆఫర్‌లోని ఎక్స్ఛేంజ్‌ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.5 వేలు తగ్గింపును పొందొచ్చు. వన్‌ప్లస్‌ 11 5జీ (OnePlus 11 5G)పై రూ.3 వేలు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌, 12 నెలలు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని ఇస్తోంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సిరీస్‌లోని ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపును ఇస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ (OnePlus Nord 3 5G)పై రూ.3,000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది. దీంతో పాటు రూ.3 వేల స్పెషల్‌ ప్రైస్‌ కూపన్‌, 6 నెలల పాటు నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని కూడా పొందొచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 (The OnePlus Nord CE 3) కొనుగోలుపై రూ.2 వేలు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌తో పాటు రూ.2 వేల ప్రైస్‌ కూపన్‌ ఇస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ లైట్‌ (OnePlus Nord CE 3 Lite), వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 2 లైట్‌ (OnePlus Nord CE 2 Lite) ఫోన్లపై రూ.1,500 ఇన్‌స్టాంట్‌ బ్యాంక్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది. నార్డ్‌ సీఈ 2 లైట్‌పై 3 నెలలు నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

మెరుగైన సౌకర్యాలతో రైల్వే స్టేషన్‌లోనే రూమ్‌.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..?

వన్‌ప్లస్‌ 11 ఆర్‌ 5జీ (OnePlus 11R 5G), వన్‌ప్లస్‌ 11 ఆర్‌ 5జీ సోలార్‌ రెడ్‌ స్పెషల్‌ ఎడిషన్‌ (Solar Red Special Edition)పై రూ.2,000 తగ్గింపును ఇస్తోంది. వీటి కొనుగోలుపై 9 నెలల పాటు నోకాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తోంది. వన్‌ప్లస్‌ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G)పై 5,000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌, రూ.14 వేలు ప్రత్యేక కూపన్‌ పొందొచ్చు. వన్‌ప్లస్‌ 10టీ 5జీ (OnePlus 10T 5G) పై రూ.5,000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌, రూ.10వేలు స్పెషల్‌ ప్రైస్‌ కూపన్‌ ఇస్తోంది.

వన్‌ప్లస్‌ 10 ఆర్‌ 5జీ (OnePlus 10R 5G) కొనుగోలుపై రూ.3,000 ఇన్‌స్టంట్‌ బ్యాంక్ డిస్కౌంట్, రూ.7,000 స్పెషల్‌ కూపన్‌ను ఇస్తోంది. 6 నెలల పాటు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. అమెజాన్‌, వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌, వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌లో వీటిని కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని