Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 22 Dec 2022 09:02 IST

1. పొంచి ఉన్న మహమ్మారి.. బూస్టర్‌పై ఆసక్తేది?

రెండేళ్లు జనాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన కరోనా మళ్లీ కోరలు చాచనుందా...? ప్రపంచ వ్యాప్తంగా తాజాగా పెరుగుతున్న కేసులు అవే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల లేనప్పటికీ.. ముందుజాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు. ప్రధానంగా టీకా బూస్టర్‌ డోసు తీసుకోవడంలో నగరవాసులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అప్పు పుట్టదు.. అభివృద్ధి సాగదు

సాక్షాత్తు ప్రభుత్వమే సీఆర్డీఏకు గ్యారెంటీ ఇచ్చినా దానిని నమ్మి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా రాజధానిపై ప్రతిష్టంబన నెలకొంది. ఈ కారణంగా బ్యాంకర్లు అప్పు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. సీఆర్డీఏ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. రూ. వెయ్యి కోట్ల రుణం కోసం ఇటీవల స్టేట్‌ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా సానుకూల ఫలితాలు రావడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కొనుగోళ్లలో కొత్త దారి!

ప్రభుత్వ దవాఖానాల్లో జరిగే కొనుగోళ్లలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెమ్‌ పోర్టల్‌లోకి ఒక్కో ఆసుపత్రి చేరుతోంది. ఇప్పటికే ఉస్మానియాలో కొన్నిరకాల పరికరాలు, సామగ్రిని జెమ్‌ పోర్టల్‌ ద్వారానే కొంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి గాంధీ ఆసుపత్రి చేరింది. ఫలితంగా జాతీయ స్థాయిలో నాణ్యమైన కంపెనీ సామగ్రిని సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విక్రయానికి వీఎంఆర్‌డీఏ మిగులు ప్లాట్లు

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) విజయనగరం, విశాఖ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో గతంలో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్రస్తుతం మిగిలి పోయిన ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వ ఈ వేలం పోర్టల్‌ konugolu.ap.gov.in ద్వారా 2023 జనవరి 3, 4 తేదీల్లో 46 ప్లాట్ల విక్రయానికి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో కొన్ని ప్లాట్ల ప్రాథమిక ధర అధికంగా నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆఖరులో.. షికారు

కొత్త సంవత్సరానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. కొవిడ్‌ అనంతరం రెండేళ్లుగా సంవత్సరాంతంలోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కార్ల షోరూంలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. చీకటిపడగానే త్వరగా మూతపడే షోరూంలు కార్లను యజమానులకు అందజేసేందుకు రాత్రి వేళ అదనపు గంటలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు చూస్తే అందుకు భిన్నంగా కన్పిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 22న నర్సపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలు(07466) నర్సపూర్‌లో 18.00 గంటలకు బయలుదేరి కైకలూరు 19.40, గుడివాడ 20.40, విజయవాడ 21.40, గుంటూరు 22.40, సత్తెనపల్లి 23.23, పిడుగురాళ్ల 23.55, సికింద్రాబాద్‌ 04.10 గంటలకు చేరుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తొలి వీధి దీపం వెలిగిందిక్కడే

నిజాం నవాబులు తొలిసారి జనరేటర్‌తో వీధి దీపం వెలిగించింది గుర్రంపోడు మండలం సుల్తాన్‌పురంలోనే. ఆనాటి నిజాం సుల్తానుకు కేంద్ర కార్యాలయం వారు లేఖ రాస్తూ.. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అయితే ఇక్కడే ఓ చిన్న పొరపాటు దొర్లింది. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌కు బదులుగా సుల్తాన్‌పురం అని లేఖలో తప్పుగా అచ్చయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అక్రమార్కులపై అంతులేని ప్రేమ

మైనింగ్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. శాఖ తరఫున ఆదాయం పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వైకాపా నాయకులు పెద్దఎత్తున ప్రకృతి సంపద కొల్లగొడుతున్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎలాంటి అనుమతులు లేకుండానే ఎర్రమట్టి, ఇసుక తవ్వకాలు భారీగా జరుపుతున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే క్వారీలు, క్రషర్లు మూసేశామని పలువురు వాపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాల ఉత్పత్తికి అడ్డదారులు

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గేదెలు, ఆవుల్లో హార్మోన్ల అసమతుల్యతను అరికట్టి పాలదిగుబడిని స్థిరంగా పొందేలా ఆక్సిటోసిన్‌ మందును గతంలో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. నిపుణులైన పశువైద్యులు లేదా పశువైద్య విభాగం శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తేనే దీనిని తాత్కాలికంగా వినియోగించేవారు. కానీ తదుపరి పాల ఉత్పత్తిని అడ్డంగా పెంచేందుకు కొందరు విచ్చలవిడిగా గుట్టుగా ఆక్సిటోసిన్‌ను వినియోగిస్తుండటం ఆందోళనకరంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బీకాంతో.. భవిత భళా!

దేశంలో గత మూడేళ్ల నుంచి ఆదరణ పొందుతోన్న కోర్సుల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ (బీకాం)  ముందుంటోంది. తెలంగాణలో ఈ ఏడాది బీటెక్‌ కంటే బీకాంలోనే ఎక్కువమంది చేరారు. ఆధునిక అవకాశాలు అందిపుచ్చుకునేలా కోర్సును వైవిధ్యంగా రూపొందించడం, వాణిజ్యశాస్త్రం చదివినవారికి అన్ని రంగాల్లోనూ విస్తృతంగా అవకాశాలుండటమే ఇందుకు కారణం. రెగ్యులర్‌ కామర్స్‌ కోర్సులకు సర్టిఫికేషన్లు తోడైతే బంగారం లాంటి కెరియర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఉన్నత విద్యతోనూ సత్తా  చాటవచ్చు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు