logo

Special Trains: గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు.. వివరాలివీ..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు.

Updated : 22 Dec 2022 07:49 IST

గుంటూరు రైల్వే: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు.

ఈనెల 22న నర్సపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలు(07466) నర్సపూర్‌లో 18.00 గంటలకు బయలుదేరి కైకలూరు 19.40, గుడివాడ 20.40, విజయవాడ 21.40, గుంటూరు 22.40, సత్తెనపల్లి 23.23, పిడుగురాళ్ల 23.55, సికింద్రాబాద్‌ 04.10 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07439) ఈనెల 23న సికింద్రాబాద్‌లో 22.35 గంటలకు బయలుదేరి పిడుగురాళ్ల 01.45, సత్తెనపల్లి 02.30, గుంటూరు 04.15, విజయవాడ 05.55, గుడివాడ 06.53, కైకలూరు 07.23, నర్సపూర్‌ 10.00 గంటలకు చేరుతుంది.

నర్సపూర్‌-యశ్వంతపూర్‌ వెళ్లే రైలు(07687) ఈనెల 25న నర్సపూర్‌లో 15.10 గంటలకు బయలుదేరి కైకలూరు 16.45, గుడివాడ 17.38, విజయవాడ 18.55, గుంటూరు 19.50, నరసరావుపేట 20.40, యశ్వంతపూర్‌ మరుసటిరోజు 10.50 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07688) ఈనెల 26న యశ్వంతపూర్‌లో 15.50 గంటలకు బయలుదేరి నరసరావుపేట 01.39, గుంటూరు 03.35, విజయవాడ 04.50, గుడివాడ 05.48, కైకలూరు 06.20, నర్సపూర్‌ 08.30 గంటలకు వెళ్తుంది.

ఈనెల 23న కాచిగూడలో 20.20 గంటలకు బయలుదేరే రైలు(07065) గుంటూరు 02.35, కాకినాడ 09.30 గంటలకు చేరుతుంది. ఈనెల 24న తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07066) కాకినాడలో 20.45 గంటలకు బయలుదేరి గుంటూరు 02.20, కాచిగూడ 08.20 గంటలకు చేరుతుంది.

ఈనెల 25న కాచిగూడలో 19.25 గంటలకు బయలుదేరే రైలు(07483) గుంటూరు 23.50, తిరుపతి 09.30 గంటలకు వెళ్తుంది. ఈనెల 26న తిరుపతిలో 20.10 గంటలకు బయలుదేరే రైలు(07484) గుంటూరు 01.50, కాచిగూడ 09.15 గంటలకు చేరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని