Published : 20 Jan 2022 20:57 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు: సీఎం జగన్‌

పోర్టులు, ఎయిర్‌ పోర్టులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు, ఎయిర్‌ పోర్టుల నిర్మాణ పనుల పురోగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు.

2.తెలంగాణలో కొత్తగా 4,207 కరోనా కేసులు.. ఇద్దరి మృతి

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,20,215 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,207 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,22,403కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Akhanda : ‘అఖండ’ 50 రోజుల వేడుకలు

3.ఐక్య పోరాటానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం.. భవిష్యత్‌ కార్యాచరణపై రేపు నిర్ణయం

పీఆర్‌సీ అంశంలో ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు ఉమ్మడి పోరాటంపై సమాలోచనలు జరిపారు. ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసులు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సమావేశంలో పాల్గొన్నారు.

4.టీనేజర్లకు టీకాలో ఆంధ్రప్రదేశే టాప్‌.. మరో సినీ నటుడుకి కరోనా పాజిటివ్‌!

దేశంలో కరోనా మహమ్మారి విస్ఫోటనం కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ ప్రభావంతో  గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. గురువారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 3.17లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ భారీ సంఖ్యలో ఇన్ఫెక్షన్లు పెరగడం కలవరపెడుతోంది.

5.భారత్‌లో 5.3 కోట్ల మంది నిరుద్యోగులు..!

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. చాలా సంస్థలు నష్టాలతో మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరుగుతోంది. 2021 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇందులో మహిళా నిరుద్యోగుల సంఖ్య దాదాపు 2 కోట్ల వరకు ఉంది. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ గణాంకాలు వెల్లడించాయి.

Viral Video : ఓటీఎస్‌ పథకంపై అవ్వ ఆగ్రహం

6.యోగిపై పోటీ.. మొదటి ప్రత్యర్థి ఖరారు..!

త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీలన్నీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ సదర్ నుంచి పోటీ చేయనున్నట్లు భాజపా ప్రకటించగా.. ఆయనకు సవాలు విసిరేందుకు ఆజాద్ సమాజ్ పార్టీ(ఏఎస్‌పీ) సిద్ధమైంది. తమ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించింది. యోగిపై పోటీ చేస్తానని ఆజాద్‌ గతంలోనే అన్నారు.

7.యాపిల్‌ కీలక సూచన.. మరి ఐఓఎస్‌ 15కు అప్‌డేట్ చేశారా?

గతేడాది యాపిల్ కంపెనీ ఐఫోన్‌13, వాచ్‌ 7 సిరీస్‌, కొత్త ఐపాడ్‌లను విడుదల చేసింది. వాటికి అనుగుణంగా అప్‌డేటెడ్‌ ఓఎస్‌ ఐఓఎస్ 15ను కూడా తీసుకొచ్చింది. అయితే ఐఓస్‌ 15 కొన్ని పాతతరం డివైజ్‌లలో అప్‌డేట్‌ కాదని యాపిల్ తెలిపింది. అలానే ఐఓఎస్‌ 14 వెర్షన్‌ యూజర్స్‌ కోసం కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది.

8.క్రెడిట్‌ కార్డు వాడ‌కం ప్రమాదకరస్థాయికి చేరుకుందని గుర్తించడమెలా..?

ప్రణాళికాబద్ధంగా ఉపయోగిస్తే క్రెడిట్ కార్డుతో చాలా లాభాలు ఉంటాయి. వ‌డ్డీ ర‌హిత కాల‌వ్యవధితో కొనుగోలు శ‌క్తి పెంచుకోవ‌డంతో పాటు రివార్డు పాయింట్ల రూపంలో అద‌న‌పు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. బాధ్యతాయుతంగా ఉప‌యోగిస్తే బ‌ల‌మైన క్రెడిట్ స్కోరును నిర్మించుకోవ‌చ్చు. దీంతో భ‌విష్యత్‌లో రుణాలు సుల‌భంగా ఆమోదం పొంద‌డంతో పాటు, మంచి మంచి ఆఫ‌ర్లను కూడా పొందే అవకాశం ఉంటుంది.

Corona Virus : కొవిడ్‌ వ్యాప్తి.. ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం !

9.టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌కు అగ్రస్థానం.. పడిపోయిన భారత్ ర్యాంక్‌
యాషెస్‌ టెస్టు సిరీస్‌ విజయం కంగారూల జట్టుకు భలేగా కలిసొచ్చింది. ఇంగ్లాండ్‌పై 4-0 తేడాతో గెలిచిన ఆసీస్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. అత్యధికంగా 119 పాయింట్లతో ఆస్ట్రేలియా తొలి స్థానం దక్కించుకోగా.. న్యూజిలాండ్‌ (117) రెండో స్థానంలో నిలిచింది. ఇక దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ను ఓడిపోయిన భారత్‌ (116) మూడో ర్యాంక్‌కు పడిపోయింది.

10.94వ సారి ఎన్నికల బరిలోకి.. 100 సార్లు ఓడిపోవడమే లక్ష్యం
ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలను వేగంగా మారుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన యూపీలో ఈ సారి ఓ వ్యక్తి 94వ సారి ఎన్నికల్లో పోటీ చేయబోతుండటం విశేషం. ఇప్పటివరకు 93సార్లు పోటీ చేసిన ఆయన.. వాటన్నింటిలోనూ ఓటమి పాలుకావడం గమనార్హం. ఆగ్రా జిల్లాలోని ఖేరాగడ్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని 74 ఏళ్ల హసనురామ్ అంబేద్కర్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని