
ICC : టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌కు అగ్రస్థానం.. పడిపోయిన భారత్ ర్యాంక్
ఐసీసీ పురుషుల టెస్టు టీమ్‌లో ముగ్గురికి చోటు
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ టెస్టు సిరీస్ విజయం కంగారూల జట్టుకు భలేగా కలిసొచ్చింది. ఇంగ్లాండ్‌పై 4-0 తేడాతో గెలిచిన ఆసీస్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. అత్యధికంగా 119 పాయింట్లతో ఆస్ట్రేలియా తొలి స్థానం దక్కించుకోగా.. న్యూజిలాండ్ (117) రెండో స్థానంలో నిలిచింది. ఇక దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ను ఓడిపోయిన భారత్ (116) మూడో ర్యాంక్‌కు పడిపోయింది. ఇక ఇంగ్లాండ్ (101), దక్షిణాఫ్రికా (99) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మరోవైపు ఐసీసీ ప్రకటించిన పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో ఒక్క భారతీయ క్రికెటర్‌కూ చోటు దక్కలేదు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను సారథిగా ఎంపిక చేసింది. అయితే పురుషుల టెస్టు జట్టులో మాత్రం ముగ్గురు టీమ్ఇండియా ఆటగాళ్లు చోటు సంపాదించడం విశేషం. కివీస్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కెప్టెన్ కాగా.. భారత్ నుంచి రోహిత్ శర్మ, రిషభ్ పంత్, అశ్విన్ చోటు దక్కించుకున్నారు. ఇక మహిళల వన్డే జట్టులో మిథాలీరాజ్, జులన్ గోస్వామిలకు చోటు దక్కింది.
అంతేకాకుండా పురుషుల, మహిళల టీ20 జట్లలో భారత్ నుంచి ఒక్కరే ప్రాతినిధ్యం వహించారు. ఐసీసీ మహిళల టీ20 జట్టుకు ఇంగ్లిష్ క్రికెటర్ నటాలీ సీవర్ కెప్టెన్‌గా ఎంపికైంది. మహిళల జట్టులో స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు స్థానం లభించింది. పురుషుల జట్టులో ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కలేదు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌నే ఐసీసీ జట్టుకు సారథిగా ప్రకటించారు. అత్యధికంగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి తలో ముగ్గురికి ఈ జట్టులో చోటు దక్కింది. వెస్టిండీస్ నుంచి ఎవరికీ అవకాశం రాలేదు.