Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 11 Mar 2024 21:07 IST

1. అమల్లోకి ‘సీఏఏ’.. నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ అమల్లోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం (Citizenship Amendment Act)-2019  పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏకకాలంలో బహుళ లక్ష్యాల ఛేదన.. ‘మిషన్‌ దివ్యాస్త్ర’ విజయవంతం

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో ఘనత సాధించింది. ‘మిషన్‌ దివ్యాస్త్ర (Mission Divyastra)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (Agni-5 MIRV)’ క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హర్షం వ్యక్తంచేశారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను ‘ఎక్స్‌’ వేదికగా అభినందించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మేం గేట్లు తెరిస్తే భారాసలో ఎవరూ ఉండరు: రేవంత్‌రెడ్డి

భారాస, భాజపా ఒక్కటై పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మేం గేట్లు తెరిస్తే భారాసలో కేసీఆర్‌ కుటుంబసభ్యులు తప్ప ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ 14 ఎంపీ సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీని బదిలీ చేయండి: ఈసీకి అచ్చెన్న లేఖ

త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు వైకాపా నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున స్టాక్‌ పెట్టుకుంటున్నారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) ఆరోపించారు. వారికి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌, ఎక్సైజ్‌ శాఖ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్నాయన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఏఏను ఇప్పుడే ఎందుకు అమలు చేస్తున్నారు?: అసదుద్దీన్‌

కేంద్ర ప్రభుత్వం ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ అమల్లోకి తీసుకురావడంపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కనిపించిన నెలవంక.. రంజాన్‌ నెల ప్రారంభం

ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్‌ మాసం ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. సోమవారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో రంజాన్‌ మాసం ప్రారంభమైనట్లు మతపెద్దలు ప్రకటించారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే మసీదులు ముస్తాబయ్యాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అర్ధరాత్రి ఆస్పత్రికి గర్భిణీ.. తాళం ఉండటంతో కటిక నేలపై ప్రసవం

అర్ధరాత్రి పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వస్తే.. తాళం వేసి ఉండటంతో వరండాలోనే మహిళ ప్రసవించింది. కారు చీకట్లో కటిక నేలపై ప్రసవ వేదన పడుతూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ హృదయవిదారక ఘటన మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఆమెకు విధించిన ఐదేళ్లు శిక్షపై న్యాయస్థానం సోమవారం స్టే ఇచ్చింది. ఓ బ్యాంకును మోసం చేసిన కేసులో సెప్టెంబర్‌ 13, 2022న మాజీ ఎంపీకి సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇదే భవిష్యత్తు అయితే.. పీడకలే: ఆనంద్‌ మహీంద్రా

రోజురోజుకీ సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దానికనుగుణంగా కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. అయితే, మితిమీరిన సాంకేతిక వినియోగంతో అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత తరంలో చాలామంది తమ రోజువారీ పనుల కోసం ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడుతుండటమే ఇందుకు కారణమంటున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రంజీ ట్రోఫీ ఫైనల్‌.. రెండో రోజూ ముంబయిదే ఆధిపత్యం

విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో రెండోరోజు కూడా ముంబయి జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో 31/3 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన విదర్భను 105 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ జట్టులో యశ్ రాఠోడ్ (27) టాప్‌ స్కోరర్‌గా కాగా.. అథర్వ తైడే (23), ఆదిత్య థాక్రే (19), యశ్ ఠాకూర్‌ (16) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని