Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 11 Jan 2022 17:12 IST

1. ఏపీలో నైట్‌ కర్ఫ్యూ.. ఎప్పటి నుంచి అంటే?

కరోనా ప్రభావం దృష్ట్యా విధించిన రాత్రి కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి తర్వాత అంటే జనవరి 18వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. పండగవేళ పెద్ద ఎత్తున ప్రజలు ఊళ్లకు వస్తుండటంతో కర్ఫ్యూ అమలు చేయటంలో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వం భావించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జగనన్నా.. ఆ సీఐ బారి నుంచి రక్షించు!

2. ఏపీలో టికెట్ల వివాదం: గంటలో 24 ట్వీట్లు చేసిన వర్మ

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram gopal varma) వరుస ట్వీట్లు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా గంటలో 24 ట్వీట్లు చేయడం గమనార్హం. సోమవారం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ అయిన ఆయన చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. తాజాగా ట్వీట్లలో అందుకు భిన్నంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మనిషికి పంది గుండె.. అమెరికా వైద్యుల ఘనత

వైద్యరంగంలో మరో అద్భుతం! అమెరికాకు చెందిన వైద్యబృందం మొట్టమొదటిసారిగా జన్యుపరంగా మార్పులు చేసిన ఓ పంది గుండెను ఓ వ్యక్తికి విజయవంతంగా అమర్చింది. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్‌ తాజాగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రధాని ఫోన్‌ చేసి చెప్పారు.. తగ్గేదేలే..: బండి సంజయ్‌

ఎన్ని కూటములు కట్టినా సీఎం కేసీఆర్‌ జైలుకు వెళ్లక తప్పదని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. 317 జీవోకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో సంజయ్‌ ప్రసంగించారు. పోరాటంలో వెనక్కి తగ్గవద్దని ప్రధాని మోదీ ఫోన్‌ చేసి చెప్పారని తెలిపారు. కొవిడ్‌ కంటే అతి ప్రమాదకరమైన వైరస్‌ కేసీఆర్‌ అని సంజయ్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వేములవాడ రాజన్న ఆలయంలో కొవిడ్ ఆంక్షలు

తెలంగాణలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 13న ముక్కోటి ఏకాదశి రోజున ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌కు టాటాగ్రూప్‌ స్పాన్సర్‌షిప్‌..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు వచ్చే ఏడాది నుంచి స్పాన్సర్లు మారనున్నారు. దేశీయ దిగ్గజ కార్పొరేట్‌ సంస్థ టాటా గ్రూప్‌ 2023 నుంచి ఐపీఎల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని క్రికెట్‌ లీగ్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ పీటీఐ వార్త సంస్థకు వెల్లడించారు. ఈ విషయాన్ని ఐపీఎల్‌ ఈవెంట్స్‌ గవర్నెంగ్‌ కౌన్సిల్‌ మంగళవారం నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2022లోనే ద్రవిడ్‌కు అసలైన పరీక్ష..!

7. భయపడొద్దు.. దిల్లీలో లాక్‌డౌన్‌ ఉండదు

కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ దిల్లీలో లాక్‌డౌన్‌ విధించబోమని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. ఈరోజు 22వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఎవరూ భయపడొద్దు.. లాక్‌డౌన్‌ ఉండదన్నారు. దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) సమావేశంలో రాజధాని ప్రాంతమంతా ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను కోరామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దిల్లీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోం మాత్రమే..

8. అమెరికాలో ఒక్కరోజే 11 లక్షల కేసులు!

కొవిడ్‌ కేసులతో దాటికి అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొవిడ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా సోమవారం ఒక్కరోజే అమెరికాలో 11లక్షల కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు జనవరి 3న ఒకేరోజు 10లక్షల కేసులు బయటపడ్డాయి. తాజాగా ఆస్పత్రి చేరికలు కూడా భారీగా నమోదయ్యాయి. ఒకేరోజు లక్షా 35వేల మంది ఆస్పత్రిలో చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కరోనా సమయంలోనూ రోల్స్‌-రాయిస్‌ రికార్డు విక్రయాలు

విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ రోల్స్‌-రాయిస్‌ 2021లో భారీగా విక్రయాలను పెంచుకొంది. కరోనా ప్రభావం, సెమికండక్టర్స్‌ కొరత వంటివి కూడా రోల్స్‌ రాయిస్‌ దూకుడును ఆపలేకపోయాయి. గతేడాది మొత్తం విక్రయాలు 50శాతం పెరిగి 5,586కు చేరాయి. ముఖ్యంగా అమెరికా, ఆసియా-పసిఫిక్‌, గ్రేటర్‌ చైనా వంటి చోట్ల విక్రయాల్లో పెరుగుదల చోటు చేసుకొంది. రోల్స్‌-రాయిస్‌ ఘోస్ట్‌ కూపే కారుకు మంచి డిమాండ్‌ వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పట్టాలపై కూలిన విమానం.. 

దురదృష్టం.. అదృష్టం ఒకేసారి కలిసొస్తే ఇలానే ఉంటుంది. ఓ చిన్న విమానం  పోయిపోయి రైలు పట్టాలపై కుప్పకూలింది. అందులో ఇరుక్కుపోయిన పైలట్‌ను పోలీసులు ఇలా బయటకు లాక్కొచ్చారో లేదో.. క్షణాల్లో ఓ రైలు వేగంగా ఆ విమాన శకలాన్ని ఢీకొంటూ వెళ్లిపోయింది. ఏ యాక్షన్‌ సినిమాకు తీసిపోని విధంగా ఉన్న ఈ సహజ దృశ్యం మొత్తం ఓ పోలీస్‌ అధికారి బాడీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని