icon icon icon
icon icon icon

Pawan Kalyan: వైకాపాకు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు గాలిలో దీపమే: పవన్‌ కల్యాణ్‌

జగన్‌ (YS Jagan) పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే తన బలమైన లక్ష్యమని జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు.

Updated : 01 May 2024 16:28 IST

మండపేట: జగన్‌ (YS Jagan) పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే తన బలమైన లక్ష్యమని జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండపేటలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం చేసే రైతు నష్టాల్లో ఉన్నాడని.. గంజాయి పండించే వైకాపా నేతలు లాభాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ద్వారంపూడి కుటుంబం దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.  దశాబ్దం నుంచి తనను చాలా రకాలుగా ఇబ్బందిపెట్టారని.. ప్రజాసంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని చెప్పారు. 

‘‘పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉండాలి. ప్రధానిగా మోదీ ఉన్నందున పాస్‌పోర్టుపై ఆయన ఫొటో లేదే? వైకాపాకు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు గాలిలో దీపమే. మన ఆస్తి పత్రాలపై జగన్‌ హక్కు ఏంటని నిలదీయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గంజాయి గూండాలను ఉక్కు పాదంతో నలిపేస్తాం. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తాం. వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందిస్తాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తాం. దళారుల దోపిడీ అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడతాం. సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కేంద్రం నుంచి వచ్చే నిధులను పంచాయతీలకే కేటాయిస్తాం. ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి పార్టీలను గెలిపించాలి’’ అని పవన్‌ కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img