Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 30 Nov 2021 08:58 IST

1. Omicron Variant: మరింతగా పాకుతోంది

 కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ మరిన్ని దేశాలకు వ్యాపించింది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో సోమవారం ఈ కేసులు వెలుగుచూశాయి. పోర్చుగీస్‌కు చెందిన 13 మంది ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు కొత్త వేరియంట్‌ సోకింది! దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ తొలిసారి వెలుగుచూసిన ప్రాంతంలోనే వీరంతా ఇటీవల పర్యటించినట్టు పోర్చుగీస్‌ నేషనల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. దక్షిణాఫ్రికా నుంచి గత శుక్రవారం నెదర్లాండ్స్‌ చేరుకున్న వారిలో 61 మంది పాజిటివ్‌ వ్యక్తులు ఉండగా, వారిలో 13 మంది కొత్త వేరియంట్‌ బాధితులేనని నిర్ధారణ అయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Omicron: వ్యాక్సినేషన్‌ రేటు తగ్గడమే కారణమా?

2. శేషాద్రి ‘డాలర్‌’ వెనకున్న కథ ఇదీ.!

తనకు డాలర్‌ శేషాద్రిగా పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఆయనే ‘ఈనాడు-ఈటీవీ’కి ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నలభై ఏళ్ల క్రితం ఓ జ్యోతిష్యుడు నా జాతకచక్రం ప్రకారం పొట్టేలు బొమ్మ కలిగిన డాలర్‌ను ధరించాలని సూచించారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే నేను జంతువు బొమ్మను ధరించడం సరికాదన్నా. ఆ శ్రీవారే జంతువులను ఆధారంగా చేసుకుని ఉన్నారని జ్యోతిష్యుడు అనడంతో నాటి నుంచి డాలర్‌ ధరిస్తున్నా. దీంతో మీడియా ప్రతినిధులు నాఇంటి పేరు పాల శేషాద్రి నుంచి డాలర్‌ శేషాద్రిగా మార్చారు’ అని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ట్విటర్‌ కొత్త సీఈఓగా భారతీయుడు

సామాజిక మాధ్యమం ట్విటర్‌కు కొత్త సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ (45) నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన కంపెనీకి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీఓ)గా ఉన్నారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సోమవారం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ‘పదహారేళ్ల పాటు కంపెనీలో సహ వ్యవస్థాపకుడి నుంచి సీఈఓగా, సీఈఓ నుంచి ఛైర్మన్‌..ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా; ఆ తర్వాత తాత్కాలిక సీఈఓ, సీఈఓగా.. ఇలా యాత్ర సాగింది. చివరిసారిగా ఇపుడు బయటకెళ్లాలని నిర్ణయించుకున్నా..’ అని డోర్సే ట్విటర్‌లో రాసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పిచ్‌ నుంచి ఎలాంటి స్పందనా లేదు.. కానీ..:  ద్రవిడ్‌

‘‘చివరి సెషన్లో భారత జట్టు గొప్ప సంయమనం, పోరాట తత్వం చూపించింది. అయిదో రోజు పిచ్‌ నుంచి ఎలాంటి స్పందనా లేదు. లంచ్‌ తర్వాత ఎనిమిది వికెట్లు పడగొట్టారంటే అది గొప్ప ప్రయత్నం వల్లే. కాస్త అదృష్టం కలిసొస్తే మ్యాచ్‌ భారత్‌ సొంతమయ్యేది. కానీ మన ఆటగాళ్లు గొప్పగా పోరాడారు. ఈ పిచ్‌పై బంతి మరీ నెమ్మదిగా, తక్కువ ఎత్తులో వచ్చింది. బౌన్స్‌ కానీ, టర్న్‌ కానీ కాలేదు. భారత పరిస్థితుల్లో మామూలుగా చివరి రోజు పిచ్‌లో పగుళ్లు వస్తాయి’’ అని ద్రవిడ్‌ వివరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IPL Mega Auction: ఉండేదెవరో.. వీడేదెవరో

5. ఆరంభంలో చాలా తప్పులు చేశా

‘‘నేను ఓ కథను కథలాగే వింటా. ఇది చిన్న చిత్రమా.. పెద్ద సినిమానా అని చూడను. పాత్ర నచ్చితేనే ఓకే చెబుతాను. నటిగా అన్ని రకాల పాత్రలు పోషించాలనుకుంటున్నాను’’ అంటోంది నటి పూర్ణ. ‘సీమటపాకాయ్‌’, ‘అవును’ లాంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన ఈ కేరళ భామ.. ఇప్పుడు ‘అఖండ’లో ఓ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది పూర్ణ. ఆ సంగతులు ఆమె మాటల్లోనే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వంటతో.. కోట్ల వీక్షకులు...

ఆమె ఓ పల్లెటూరి అమ్మాయి. కానీ వీడియో పెడితే చాలు.. కోట్ల మంది చూసేస్తారు. ఇంతకీ ఆమె పెట్టేది వేటిపైనో తెలుసా? తను చేసే వంటకాల గురించి! అంత ప్రత్యేకత ఏముంది అందులో? చదివి తెలుసుకోండి! నదీ జీవనశైలిది శ్రీలంకలోని మారుమూల గ్రామం. చదువు, ఉద్యోగమంటూ పట్టణానికి వెళ్లింది. అక్కడి పర్యావరణ కాలుష్యం, కల్తీ ఆహారం ఆరోగ్యానికి హాని చేయడం గుర్తించింది. అంతే... సొంతూరికి తిరిగి ప్రయాణమైంది. పల్లె జీవితాన్ని, అలనాటి జీవన విధానాల్ని పరిచయం చేయడం ప్రారంభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జబల్‌పుర్‌లో బోట్స్‌వానా మహిళ ఆచూకీ కోసం అధికారుల హైరానా

కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాపించిన ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారిపై గట్టి నిఘా, పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ క్రమంలో బోట్స్‌వానాకు చెందిన మహిళ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు వచ్చిందన్న సమాచారం రావడంతో స్థానిక అధికారులకు ఓ రోజంతా కునుకు కరవైంది. బోట్స్‌వానా ఆర్మీలో కెప్టెన్‌గా పనిచేస్తున్న 34 ఏళ్ల ఒరీమెట్సో లిన్‌ ఖుమో ప్రస్తుతం అధికారిక పర్యటనపై భారత్‌లో ఉంది. ఈనెల 18న దిల్లీ నుంచి జబల్‌పుర్‌లోని ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌కు వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అంతర్గత పరీక్షలే కీలకం

రాబోయే రోజుల్లో ఒకవేళ కరోనా ఉద్ధృతమై పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించలేని సమయంలో అంతర్గత పరీక్షల మార్కులను ప్రామాణికంగా తీసుకోనున్నారు. వీటి ఆధారంగా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇందుకోసం తొలిసారి పాఠశాలల స్థాయిలో ఫార్మెటివ్‌, ఇంటర్‌లో అర్ధ సంవత్సరం పరీక్షలకు ఉమ్మడి ప్రశ్నపత్రం విధానాన్ని తీసుకొచ్చారు. రెండేళ్లుగా పదోతరగతి, గతేడాది ఇంటర్‌కు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించలేదు. ఈ సమయంలో మార్కుల మదింపు కష్టంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరింత సులువుగా విద్యార్థి వీసాలు

9. అప్రెంటిస్‌షిప్‌కు గూగుల్‌లో అవకాశం!

డిగ్రీ అర్హతతో ఐటీ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నారా? అందుకు చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది సెర్చ్‌ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌. ఇటీవల గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం గూగుల్‌ హైదరాబాద్‌ ‘అప్రెంటిస్‌షిప్‌ ప్రోగ్రాం’ను ప్రకటించింది. డిజిటల్‌ మార్కెటింగ్‌, డేటా ఎనలిటిక్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీ విభాగాల్లో తమ నైపుణ్యాలను పెంచుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో చేరవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బోల్తా పడొద్దు!

రోగ్యమే మహా భాగ్యం. దీన్ని ఎవరికి వారు కాపాడుకోవాల్సిందే. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాల్సిందే. కానీ కొందరు జబ్బు లక్షణాలు కనిపిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. ‘ఆ ఏమవుతుందిలే’ అని నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. మరికొందరు చిన్న చిన్న విషయాలకే డాక్టర్ల దగ్గరికి, అదీ స్పెషలిస్టుల దగ్గరికి పరుగెత్తుకొని వెళ్తుంటారు. ఇది ఆయా వ్యక్తుల ఆలోచనా ధోరణి, ఆర్థిక స్థితిగతులు.. డాక్టర్లు, ఆసుపత్రుల అందుబాటు వంటి వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వస్త్ర మాస్కులకు పూతతో అదనపు రక్షణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని