TTD: నడక దారి భక్తులకు త్వరలో టోకెన్లు... శ్రీవారి మెట్టు మార్గంలో 5 నుంచి అనుమతి

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన  పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Updated : 30 Apr 2022 22:30 IST

తిరుమల: తిరుమల వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో శనివారం పాలకమండలి సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత పాలకమండలి నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. 

తితిదే నిర్ణయాలు...

*టైం స్లాట్‌ దర్శనాలు, టోకెన్లు కొనసాగించాలని తితిదే నిర్ణయం.

* నడక దారి భక్తులకు త్వరలో టోకెన్ల జారీ ప్రక్రియ.

* తిరుమల బాలాజీనగర్‌ వద్ద 2.86 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్‌ బస్‌ స్టేషన్‌ ఏర్పాటు.

* శ్రీవారి మెట్టుమార్గంలో మే 5 నుంచి భక్తులకు అనుమతి.

* శ్రీనివాస సేతు రెండోదశ పనులకు రూ.100కోట్లు కేటాయింపు.

* తితిదే ఉద్యోగుల వసతి గృహాల ఆధునికీకరణకు రూ.19.40కోట్లు.

* ఇకపై వస్తురూపంలో విరాళాలు ఇచ్చే దాతలకూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

నవీ ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణం...

మహరాష్ట్ర నవీ ముంబయిలో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి 10ఎకరాల స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు శనివారం జరిగిన తితిదే బోర్డు సమావేశం ప్రారంభంలో భూమి పత్రాలను మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు.  ఆలయ నిర్మాణానికి రేమండ్ సంస్థ ముందుకొచ్చింది. ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని రేమండ్ గ్రూప్ చైర్మన్, ఎండీ తరఫున ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ హామీ ఇచ్చినట్లు తితిదే తెలిపింది. భూమిని కేటాయించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చిన రేమండ్ గ్రూప్ చైర్మన్ కు తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని