Andhra News: తితిదే ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష.. జరిమానా

కోర్టు ధిక్కరణ కేసులో తితిదే ఈవో ధర్మారెడ్డిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల రోజుల జైలు, రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

Updated : 13 Dec 2022 18:35 IST

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. ముగ్గురు తాత్కాలిక ఉద్యోగుల సర్వీస్‌ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, రూ. 2వేలు జరిమానా విధిస్తూ ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు  వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని