Telangana News: మళ్లీ విధుల్లోకి ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు.. మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు

తెలంగాణలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ విధుల్లోకి తీసుకుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించింది. అయితే మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. పార్టీ నేతలు, ఇతర రూపాల్లో వచ్చిన విజ్ఞప్తులు, డిమాండ్లను పరిగణనలోకి

Updated : 10 Aug 2022 15:39 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ విధుల్లోకి తీసుకుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించింది. అయితే మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. పార్టీ నేతలు, ఇతర రూపాల్లో వచ్చిన విజ్ఞప్తులు, డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి విధుల్లోకి తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. దీంతో 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు వారి పాత స్థానాల్లోనే విధులు నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని