Venkaiah Naidu: కులాల కుమ్ములాటలో యువకులు దూరవద్దు: వెంకయ్యనాయుడు

ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Updated : 21 Aug 2023 11:27 IST

గుంటూరు: ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరులో భాష్యం విద్యాసంస్థలు నిర్వహించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువతే ఈ రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని చెప్పారు. అందరూ మాతృభాషలో మాట్లాడండి, మాతృభాష మర్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు.

‘‘ఇష్టపడి, కష్టపడండి చదవండి. క్రమశిక్షణ చాలా ముఖ్యం. మీ భవిష్యత్తుకు అదే పునాది. ర్యాంకుల కోసం చదవకండి. విజ్ఞానం, వివేకం పెంచుకోవడానికి చదవండి. కులాల కుమ్ములాటలో యువకులు దూరవద్దు. కులం.. మతం.. ప్రాంతం పేరుతో గొడవలు మీకు, దేశానికి  మంచిది కాదు’’ అని విద్యార్థులను ఉద్దేశించి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని