Chandrababu arrest: ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు: విజయవాడ సీపీ

తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఆదివారం నిర్వహించ తలపెట్టిన కార్ల ర్యాలీకి అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతిరాణ టాటా తెలిపారు. 

Updated : 23 Sep 2023 20:33 IST

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఆదివారం నిర్వహించ తలపెట్టిన కార్ల ర్యాలీకి అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతిరాణ టాటా తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా కమిషనరేట్‌ పరిధిలో ర్యాలీలు, ప్రదర్శనలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ నిర్వహించనున్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసిందన్నారు. ర్యాలీ నిర్వహిస్తే పలు సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు.

మరో వైపు హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా ఐటీ ఉద్యోగులు తలపెట్టిన చలో రాజమహేంద్రవరం అడ్డుకోవడానికి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏపీ సరిహద్దులోని గరికపాడు వద్ద నుంచి అనుమంచిపల్లి వరకు  3 పోలీస్‌ అవుట్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చే వాహనాలను క్షుణ్నంగా పరిశీలించి, వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకున్న తర్వాతే అనుమతించనున్నారు. సుమారు 150 నుంచి 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని