అందమైన కురుల కోసం వీటిని ట్రై చేశారా?

అందమైన, ఆరోగ్యమైన కురుల కోసం మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నేటి రోజుల్లో అది అంత సులభమైనదేమీ కాదు.

Published : 27 May 2022 01:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందమైన, ఆరోగ్యమైన కురుల కోసం మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నేటి రోజుల్లో అది అంత సులభమైనదేమీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కింది చిట్కాలు పాటిస్తూ శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 

అవకాడో హెయిర్‌ మాస్క్‌:

కురులకు అవసరమైన ‘ఈ’, ‘బి’ విటమిన్లు అవకాడోలో పుష్కలంగా ఉంటాయి. ఇది వెంట్రుకలను మాశ్చరైజింగ్‌ చేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. ముందుగా ఒక అవకాడోని తీసుకొని పేస్టులా చేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె(ఆప్షనల్‌), రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె కలుపుకోవాలి. డ్రై హెయిర్‌కి ఈ మిశ్రమాన్ని పట్టించాలి. ఓ గంట సమయం తరవాత షాంపుతో తలస్నానం చేస్తే సరి.

పట్టులాంటి కురులకు కలబంద..

రెండు స్పూన్ల కలబంద గుజ్జులో రెండు నిమ్మకాయల రసాన్ని కలిపి జుట్టుకు పట్టించాలి. మాడు, వెంట్రుకలకు అంటుకునేలా మర్దన చేసుకోవాలి. ఓ అరగంట తరవాత స్నానం చేయాలి. 

మెంతులతో మాయ చేసేయండి..

మెంతులు వెంట్రుకలకు మంచి పోషకాలను అందించేవిగా పని చేస్తాయి. మెంతులను పెరుగుతో కలిపి నానబెట్టాలి. రెండు గంటల సమయం తరవాత వాటిని పేస్టులా చేసుకొని వెంట్రులకు పట్టించాలి. అరగంట వేచి ఉండాలి. తరవాత షాంపూతో తలస్నానం చేసి జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి. ఎక్కువ కెమికల్స్‌ ఉన్న షాంపూలను వాడకపోవడమే ఉత్తమం. కొంతమంది జుట్టు తడి ఆరక ముందే జడలు అల్లుకుంటారు. ఇలా చేయడం వల్ల శిరోజాలు నిర్జీవమవుతాయి.  
     

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని