Updated : 04 Jul 2021 18:07 IST

గ్రేటర్‌లో రేపు నీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సోమవారం పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్‌-2లో నాగోలు జంక్షన్‌ వద్ద పైప్‌లైన్‌కు మరమ్మతులు చేస్తున్నందున నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..

బాలాపూర్‌, మైసారం, బార్కాస్‌ రిజర్వాయర్‌, మేకలమండి, భోలక్‌పూర్‌ రిజర్వాయర్‌, తార్నాక, లాలాపేట్‌, బౌద్ధనగర్‌, మారేడ్‌పల్లి, కంట్రోల్‌ రూమ్‌, రైల్వేస్‌, ఎమ్‌ఈఎస్‌, కంటోన్మెంట్‌, ప్రకాష్‌ నగర్‌, పాటిగడ్డ రిజర్వాయర్‌, హస్మత్‌ పేట్‌, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్‌ రిజర్వాయర్‌, వైశాలినగర్‌,  బీఎన్‌రెడ్డి నగర్‌, వనస్థలిపురం, ఆటోనగర్‌, మారుతీనగర్‌ రిజర్వాయర్‌, మహేంద్ర హిల్స్‌ రిజర్వాయర్‌, మహేంద్ర హిల్స్‌ రిజిర్వాయర్‌, ఏలుగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్‌, బీరప్పగూడ రిజర్వాయర్‌, మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, బోడుప్పల్‌లోని కొన్ని ప్రాంతాలకు సోమవారం నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts