మండే ఎండలో వినూత్నంగా పెళ్లి ఊరేగింపు.. చూడండి..

రోజు రోజుకీ ఎండలు మండిపోతున్నాయి. భానుని భగభగల నుంచి తప్పిచుకోవడం ఎవరి వల్ల కావట్లేదు.

Updated : 29 Apr 2022 12:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసలే పెళ్లిళ్ల సీజన్‌. మరోవైపు మండుతోన్న ఎండలు. భగభగమండే ఎండల్లో పెళ్లి ఊరేగింపులు, ఇతరత్రా కార్యక్రమాలు కష్టంగా మారుతున్నాయి. అయితే.. ఈ ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి ఓ పెళ్లి బృందం కాస్త విభిన్నంగా ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెళ్లి కొడుకు గుర్రంపై కూర్చొని ఉండగా.. బంధువులు, స్నేహితులందరూ డ్యాన్స్‌లు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. అయితే ఎండవేడి నుంచి తప్పించుకునేందుకు పసుపు రంగు పరదా లాంటి దానిని టెంటులాగా ఏర్పాటు చేసుకొన్నారు. ‘భారతీయులు పెళ్లిళ్లకు కొత్త ఆవిష్కరణను రూపొందించారు. భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు ఇలా టెంట్‌ ఏర్పాటు చేసుకొని బరాత్‌ జరుపుకొంటున్నారు’ అని  ఈ వీడియోకి క్యాప్షన్‌ జోడించారు. బుధవారం పోస్టు చేసిన ఈ  వీడియోను ఇప్పటివరకూ 18వేల మంది వీక్షించగా కొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని