TS News: ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ డెయిరీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రంలో పాడి ఉత్పత్తి, వినియోగాన్ని సమాన దృష్టితో చూస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Published : 04 Mar 2024 19:08 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో పాడి ఉత్పత్తి, వినియోగాన్ని సమాన దృష్టితో చూస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ, పశుసంవర్ధక, డెయిరీ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. మాదాపూర్ హెటెక్స్ ప్రాంగణంలో ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సును మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్ఆర్ఆర్) చుట్టూ విభిన్న క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నామని.. వాటిలో భారీ డెయిరీ క్లస్టర్లు కూడా నెలకొల్పుతామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని