health : బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే ఐదు యోగాసనాలు

ఉరుకులు, పరుగుల జీవనశైలిలో చాలా మంది ఎదుర్కోంటున్న సమస్య బెల్లీ ఫ్యాట్‌. వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద వరకూ ప్రతి ఒక్కరు ఈ ససమ్యతో సతమతమవుతున్నారు.

Published : 16 Apr 2022 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉరుకులు, పరుగుల జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య బెల్లీ ఫ్యాట్‌. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద ప్రతి ఒక్కరూ ఈ ససమ్యతో సతమతమవుతున్నారు. అదే ఊబకాయంగా మారి చిన్న వయస్సులోనే మందులు వాడాల్సిన పరిస్థతి వస్తోంది. దీని వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ చేరి గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతోంది. రోజువారి దినచర్యలో యోగాను చేర్చుకుని కొన్ని ఆసనాలను క్రమం తప్పకుండా వేయడం ద్యారా ఎలాంటి శారీరక ఒత్తిడి లేకుండా ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు అంటున్నారు. అధిక బరువును తగ్గడానికి కూడా ఇది మంచి వ్యాయామంగా పనిచేస్తుందంటున్నారు. మరి అవేంటో చూద్దాం పదండి..

కపాలభతి

సౌకర్యవంతమైన భంగిమలో కూర్చుని మీ వీపును నిటారుగా ఉంచండి. మీ అరచేతులను మోకాళ్లకు ఎదురుగా ఉంచి సహజంగా ఊపిరి పీల్చుకోండి. శీఘ్రంగా, లయబద్ధంగా ఊపిరి తీసుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలపై ఏకాగ్రతను కేంద్రీకృతం చేయండి.


పాదహస్తాసన

నిటారుగా నిలబడి, మీ చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచి, మీ పాదాలను చేతులతో తాకి మడమల అడుగు భాగం వరకూ చేతులను చేర్చండి. శ్వాస తీనుకున్నప్పుడు మోకాళ్లను వంచకుండా నేలవైపునకు ఉండేటట్లు జాగ్రత్త పడండి.


ధనురాసనం

ఈ ఆసనంలో మీ శరీరం విల్లు ఆకారాన్ని అనుకరిస్తుంది. బోర్ల పడుకుని తలను కొంచె పైకి ఎత్తాలి. వెనుకనుంచి మోకాళ్లను చేతులతో వంచి ధనస్సు లాంటి ఆకారాన్ని ఏర్పాటు చేయాలి.


పవనముక్తాసనం

పడుకుని మీ ముఖాన్ని పైకి ఉంచాలి. చేతులతో కాళ్లను పట్టుకుని తోడలు, పొత్తికడుపునకు ఒత్తిడి కలిగిస్తూ మోకాళ్లు ముఖం దాకా వచ్చేలా చేయాలి. ఇలా 60 నుంచి 90 సెకన్లు ఈ భంగిమలో ఉండాలి. 


భుజంగాసనం

బోర్లా పడుకుని చేతులను నేలకి ఆనించి తల నుంచి నడుం భాగం వరకూ పైకి లేపండి. ఈ భంగిమలో 30 సెకన్లు పాటు ఉండండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని