రాజ్‌నాథ్‌తో చైనా రక్షణ మంత్రి భేటీ

భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీ సమావేశమయ్యారు. రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన వారు శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న తీవ్ర స్థాయి ఉద్రిక్తతల..

Published : 05 Sep 2020 01:41 IST

మాస్కో: భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీ సమావేశమయ్యారు. రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన వారు శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న తీవ్ర స్థాయి ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కీలక అంశాలపై వీరు చర్చించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. మే నెలలో తొలిసారి లద్దాఖ్‌లో సైనిక ఘర్షణ చోటుచేసుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. లద్దాక్‌ సరిహద్దుల్లో నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితులపై ప్రధానంగా ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
చైనా ఎత్తులకు భారత్‌ పైఎత్తు!
దిగొస్తున్న చైనా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని