Covid test: ఏ సమయంలో కొవిడ్‌ పరీక్ష మంచిదంటే..

కొవిడ్‌ పరీక్ష రోజులో ఎప్పుడు చేయించుకున్నా ఫలితం ఒకేలా ఉంటుందా? ఇదేం సందేహం అనుకోకండి. రాత్రి వేళతో పోలిస్తే... మధ్యాహ్న సమయంలో కొవిడ్‌ పరీక్ష చేయించుకోవడం ద్వారా  రెండింతలు కచ్చితంగా ‘పాజిటివ్‌’ ...

Updated : 28 Oct 2021 06:56 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌ పరీక్ష రోజులో ఎప్పుడు చేయించుకున్నా ఫలితం ఒకేలా ఉంటుందా? ఇదేం సందేహం అనుకోకండి. రాత్రి వేళతో పోలిస్తే... మధ్యాహ్న సమయంలో కొవిడ్‌ పరీక్ష చేయించుకోవడం ద్వారా  రెండింతలు కచ్చితంగా ‘పాజిటివ్‌’ ఫలితం వెల్లడి అవుతుందని తాజా పరిశోధనలో తేలింది! వండర్‌బిల్ట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని రూఢి పరిచారు. శరీరంలో అత్యంత సహజంగా జరిగే నిద్ర-మేలుకొలుపు ప్రక్రియను ‘సర్కాడియన్‌ రిథమ్‌’ అంటారు. 24 గంటలకోసారి ఇది పునరావృతం అవుతుంది. ఈ లయబద్ధ జీవనచక్రం కారణంగా రోగనిరోధక వ్యవస్థ మధ్యాహ్నం వేళ అత్యంత చురుగ్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్‌కు గురైన కణాలు... రక్తం, శ్లేష్మంలోకి వైరస్‌, బ్యాక్టీరియా అణువులను సరిగ్గా ఆ సమయంలోనే అధికంగా విడుదల చేస్తుంటాయి. కాబట్టి, మధ్యాహ్నం వేళ కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే ఫలితం మరింత కచ్చితంగా వచ్చే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని