కోల్‌కతాలో కొనసాగనున్న నిషేధం

కరోనా వైరస్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకొని పలు నగరాలనుంచి కోల్‌కతాకు విమానాల రాకపోకలపై..

Updated : 11 Aug 2020 10:44 IST

కోల్‌కతా: కరోనా వైరస్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకొని పలు నగరాల నుంచి కోల్‌కతాకు విమానాల రాకపోకలపై బెంగాల్‌ ప్రభుత్వం నిషేధాన్ని కొనసాగించింది. కోల్‌కతాకు దిల్లీ, ముంబయి, చెన్నై, పుణె, నాగ్‌పుర్‌, అహ్మదాబాద్‌ నగరాలనుంచి విమానాల రాకపోకలపై నిషేధం ఈనెల 31 వరకు ఉంటుందని వెల్లడించింది. మొదట జులై 6 నుంచి 19వ తేదీ వరకు నిషేధాన్ని విధించిన ప్రభుత్వం దాన్ని గతంలో పొడిగించింది.  తాజాగా ఈనెల 31 వరకు నిషేధం కొనసాగనున్నట్లు రాష్ట్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 98,459 కరోనా కేసులు నమోదవగా 2,100 మంది మృతిచెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని