కాగ్‌గా ప్రమాణస్వీకారం చేసిన ముర్ము

భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)గా గిరీష్‌చంద్ర ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆ

Updated : 08 Aug 2020 11:26 IST

దిల్లీ : భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)గా గిరీష్‌చంద్ర ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ముర్ము జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి బుధవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఈయన 1985 బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని