ఎర్రకోటలో గణతంత్ర వేడుకలు లేనట్లేనా?

భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొత్త రకం వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం స్ట్రెయిన్‌ వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతోంది. కాగా.. మహమ్మారి నేపథ్యంలో వచ్చే ఏడాది

Updated : 25 Jan 2024 12:11 IST

కరోనా ఎఫెక్ట్‌తో పలు మార్పులు

దిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొత్త రకం వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం స్ట్రెయిన్‌ వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతోంది. కాగా.. మహమ్మారి నేపథ్యంలో వచ్చే ఏడాది గణతంత్ర వేడుకల్లోనూ ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. వీక్షకుల సంఖ్యను తగ్గించడం.. మాస్క్‌లు, భౌతికదూరం తప్పనిసరి చేయడంతో పాటు చరిత్రలో తొలిసారిగా ఎర్రకోటకు దూరంగా వేడుకలను నిర్వహంచనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 

సాధారణంగా ఏటా గణతంత్ర వేడుకల పరేడ్‌ ఎర్రకోటలో ముగుస్తుంది. అయితే, ఈసారి కరోనా దృష్ట్యా పరేడ్‌ను విజయ్ చౌక్‌ నుంచి నేషనల్‌ స్టేడియం వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరేడ్‌ దూరాన్ని 8.2 కిలోమీటర్ల నుంచి 3.3 కిలోమీటర్లకు తగ్గించనున్నారట. ఇక పరేడ్‌లో పాల్గొనేవారి సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించినట్లు సమాచారం. అంతకుముందు ఒక్కో బృందానికి 144 మంది సభ్యులుండగా.. ఈసారి దాన్ని 96కు కుదించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. విన్యాసాల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇక గణతంత్ర వేడుకల్లో వీక్షకుల సంఖ్యను కూడా భారీగా తగ్గించినట్లు సమాచారం. అంతకుముందు లక్ష మందికి పైగా వీక్షకులను అనుమతించగా.. ఈసారి 25వేలకు పరిమితం చేస్తారని తెలుస్తోంది. 15ఏళ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఇవ్వట్లేదని, సాంస్కృతి కార్యక్రమాల సంఖ్యను కూడా కుదించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కాగా.. ఈసారి గణతంత్ర వేడుకలకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు ఇటీవల కేంద్ర విదేశాంగశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యూకేలో కరోనా కొత్తరకం విజృంభించడంతో పాటు భారత్‌లోనూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోరిస్‌ జాన్సన్‌ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. 

ఇవీ చదవండి..

దేశంలో మరో 14 కొత్త రకం కరోనా కేసులు

అమెరికాలోనూ కొత్తరకం వైరస్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని