విదా, సోఫీ సేవలు అమోఘం: మోదీ

దేశ భద్రత అంశంలో జాగిలాల ప్రాధాన్యతను ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. 74వ స్వాతంత్ర్య వేడుకల్లో చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాప్‌ ‘ కమెండేషన్‌ కార్డ్స్‌’ అందుకున్న విదా, సోఫీ జాగిలాల సేవల్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీ బాత్‌ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కొత్తగా పెంపుడు జంతువుల్ని...

Published : 30 Aug 2020 20:34 IST

దిల్లీ: దేశ భద్రత అంశంలో జాగిలాల ప్రాధాన్యతను ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. 74వ స్వాతంత్ర్య వేడుకల్లో చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ ‘ కమెండేషన్‌ కార్డ్స్‌’ అందుకున్న విదా, సోఫీ జాగిలాల సేవల్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీ బాత్‌ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కొత్తగా పెంపుడు జంతువుల్ని తెచ్చుకునే వారు దేశీయ జాతి శునకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అసలు విదా, సోఫీల పేరునే ప్రధాని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారో తెలుసా?

‘విదా’ లాబ్రడార్‌ జాతికి చెందిన జాగిలం. ఉత్తర కమాండ్ ఆర్మీలో సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు 5 మందు పాతరలను, ఒక గ్రనేడ్‌ను కనిపెట్టి, రక్షణ సిబ్బందికి ఎలాంటి ఆపద కలగకుండా చేసింది. మరో జాగిలం సోఫీ బాంబు నిర్వీర్య బృందంలో కీలకంగా సేవలందించింది. అంతేకాకుండా బాంబులను గుర్తించడంలో దిట్ట. పలుమార్లు బాంబులను గుర్తించి ఎన్నో ప్రాణాలను రక్షించింది. ఈ రెండు శునకాల పనితనంతో భద్రతా సిబ్బంది ఇవి ఎంతగా సహకరిస్తున్నాయో మరోసారి నిరూపితమైందని మోదీ చెప్పారు.

ఆర్మీలో డాగ్‌ యూనిట్‌ను ‘ది సైలంట్‌ వారియర్స్‌’ అని పిలుస్తారు. సైలంట్‌ వారియర్స్‌ పని తీరును మరింత మెరుగు పరిచేందుకు రక్షణశాఖ గత డిసెంబర్‌లో కొన్ని మార్పులు చేసింది. వాటి కోసం ప్రత్యేకంగా ఆడియో-వీడియో నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసింది. జాగిలాలకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లకు వీటిని అమర్చుతారు. తద్వారా  దాదాపు కిలోమీటరు దూరంలోని శత్రువులను కూడా గుర్తించి సిబ్బందికి సమాచారం అందించే వీలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని