ప్రశాంత్‌ భూషణ్‌కు రూపాయి విరాళం..!

కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే తన తరపున న్యాయవాది, సీనియర్‌ సహచరుడు రాజీవ్‌ ధావన్‌ జరిమానా మొత్తం రూపాయిని తనకు విరాళంగా ఇచ్చినట్లు ప్రశాంత్‌ భూషణ్‌ వెల్లడించారు.

Published : 31 Aug 2020 15:59 IST

సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు సహచరుడు రాజీవ్‌ ధావన్‌ అందజేత

దిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు భారత అత్యున్నత న్యాయస్థానం ఒక్క రూపాయి జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఆయన న్యాయవాది, సీనియర్‌ సహచరుడు రాజీవ్‌ ధావన్‌ జరిమానా మొత్తం రూపాయిని తనకు విరాళంగా ఇచ్చినట్లు ప్రశాంత్‌ భూషణ్‌ వెల్లడించారు. ఈ విరాళాన్ని తాను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాని ప్రశాంత్‌ భూషణ్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్‌ భూషణ్‌ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు ఆయనకు రూపాయి జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని సెప్టెంబర్‌ 15లోగా చెల్లించకపోతే 3నెలల జైలుశిక్ష, 3సంవత్సరాలు ప్రాక్టీస్‌పై నిషేధం విధిస్తామని కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ భూషణ్ జరిమానా చెల్లించేందుకు సిద్ధమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని