కేంద్ర మంత్రికి ‘వటాయన్’‌ పురస్కారం 

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌కు ‘వటాయన్‌’ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఈ అవార్డును ఈనెల 21న లండన్‌లో నిర్వహించే సమావేశంలో

Updated : 20 Nov 2020 00:34 IST

న్యూ దిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌కు ‘వటాయన్‌’ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఈ అవార్డును ఈనెల 21న లండన్‌లో నిర్వహించే సమావేశంలో మంత్రికి ఇవ్వనున్నారు. రమేశ్‌ పోఖ్రియాల్‌ చేసిన రచన, కవిత్వం, సాహిత్యానికి ఈ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ 75 పుస్తకాలపైనే రాశారు. ఆయనకు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కాయి. అప్పటి ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి చేతుల మీదుగా సాహిత్య భారతి అవార్డు, అప్పటి రాష్ట్ర్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా సాహిత్య గౌరవ్‌ సమ్మాన్‌ అవార్డు అందుకున్నారు. దుబాయి, మారిషస్‌, ఉక్రేయిన్‌, నేపాల్‌ దేశాల నుంచి గౌరవ అవార్డులను కూడా స్వీకరించారు. ఆయన రచనలు చేసిన పలు పుస్తకాలు పలు భాషల్లో అనువాదం అయ్యాయి. కవితలు, రచనా సాహిత్యంలో కృషి చేసిన వారికి వటాయన్‌ జీవితకాల సాఫల్య పురస్కారం అందిస్తారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని