Covishiled: అదర్‌ పూనావాలా హామీ ఇచ్చారు

రెండో దశ కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో..అర్హులందరికీ వేగంగా టీకాలు అందించాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Updated : 13 May 2021 12:15 IST

టీకా డోసుల పంపిణీపై మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబయి: రెండో దశ కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో.. అర్హులందరికీ వేగంగా టీకాలు అందించాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తమకు మే 20 తరవాత 1.5 కోట్ల కొవిషీల్డ్‌ డోసులు అందనున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సీరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు హామీ ఇచ్చారని తెలిపింది. రాష్ట్రంలో కరోనా విజృంభణ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం నిర్వహించిన సమావేశం అనంతరం ఈ ప్రకటన చేసింది. 

‘మే 20 తరవాత 1.5కోట్ల  కొవిషీల్డ్‌ టీకా డోసులను మహారాష్ట్రకు అందజేస్తామని సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఆ డోసులు అందిన తరవాత 18 నుంచి 44 సంవత్సరాల వయసు వారికి టీకా వేయడం ప్రారంభిస్తాం’ అని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. కేంద్రం అనుమతించినప్పటికీ, టీకాల కొరత కారణంగా ప్రస్తుతం ఈ వయసు వారికి అక్కడి ప్రభుత్వం టీకాలు అందించడంలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను కూడా 45ఏళ్లు పైబడిన వారికే కేటాయించనుంది. అలాగే లాక్‌డౌన్ గురించి మంత్రి మాట్లాడుతూ.. మరో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రతిపాదనలు వచ్చాయని, ఈ అంశంపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మహారాష్ట్రలో తాజాగా 46,781 మంది కరోనా బారిన పడగా..816 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు 52,26,710 మందికి వైరస్ సోకింది. 46లక్షల మందికి పైగా కోలుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని