Updated : 16 Aug 2021 14:46 IST

 Afghan: బైడెన్‌ మమ్మల్ని మోసం చేశావు.. బైడెన్‌ నువ్వే బాధ్యుడవు.. !

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా సేనలు అర్థాంతరంగా అఫ్గానిస్థాన్‌ వీడటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అమెరికాలోని అఫ్గాన్‌ జాతీయులు అధ్యక్షుడు జో బైడెన్‌పై మండిపడుతున్నారు. అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల పాలవ్వడానికి బైడెన్‌ తీరే కారణమని ఆరోపిస్తున్నారు. వారు నేడు శ్వేతసౌధం ఎదుట పెద్దసంఖ్యలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ‘బైడెన్‌ నువ్వు మమ్మల్ని మోసం చేశావు’, ‘బైడెన్‌ నువ్వే బాధ్యుడవు’ అంటూ నినాదాలు చేశారు. అఫ్గాన్‌ ప్రజలు మళ్లీ తాలిబన్ల బారిన పడి ఉండాల్సింది కాదన్నారు. 

‘‘అఫ్గానిస్థాన్‌ మహిళలకు భవిష్యత్తు ఉండదు. మేము మళ్లీ ఆంక్షల మధ్య జీవించాలనుకోవడంలేదు. అది స్వేచ్ఛకాదు’’ అంటూ అఫ్గాన్‌ మహిళలు అంటున్నారు. చాలా మంది అఫ్గాన్‌లోని ఉంటున్న కుటుంబ సభ్యుల క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఫ్గాన్‌ తాజా పరిస్థితులపై అధ్యక్షుడు బైడెన్‌ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. కనీసం సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో కూడా స్పందించలేదు. అఫ్గాన్‌ పరిస్థితులపై అధ్యక్షుడు ఎలా స్పందించాలనే అంశాలపై శ్వేత సౌధం సలహాదారులు చర్చలు జరుపుతున్నారు. 

మరోపక్క అమెరికా మాజీ అద్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కూడా బైడెన్‌ వైఖరిని తప్పుపట్టారు. అఫ్గాన్‌ దుస్థితికి బాధ్యత వహిస్తూ బైడెన్‌ రాజీనామా చేయాలన్నారు. ఈ మేరకు ఆదివారం ట్రంప్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కొవిడ్‌ కేసుల పెరుగుదల, అఫ్గాన్‌ పరిస్థితులు దిగజారడానికి , సరిహద్దుల్లో దుస్థితికి, ఆర్థిక వ్యవస్థ దుస్థితికి ఆయనే కారణమన్నారు.   

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని