రాహుల్‌ యాత్ర ముగియగానే.. ప్రియాంక గాంధీతో ‘మహిళా మార్చ్‌’

భారత్‌ జోడో యాత్ర ముగిసిన వెంటనే మరో యాత్రకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

Published : 05 Dec 2022 01:32 IST

దిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న భారత్‌ జోడో యాత్ర ముగిసిన వెంటనే మరో యాత్రకు సిద్ధమవుతోంది. ప్రియాంక గాంధీ నేతృత్వంలో ‘మహిళా మార్చ్‌’ పేరుతో జనవరిలో యాత్ర ప్రారంభమవుతుందని ఆ పార్టీ ఎంపీ, సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో రెండు నెలలపాటు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. జనవరి 26 నుంచి మార్చి 26వరకు మహిళా మోర్చ ఆధ్వర్యంలో యాత్ర కొనసాగుతుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ ప్రజలను ఏకం చేసేందుకు ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో పూర్తైన ఈ యాత్ర.. ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ రాష్ట్రంలో మొత్తం 17 రోజులు 500కి.మీ మేర కొనసాగనుంది. మరో నాలుగు రాష్ట్రాల మీదుగా కశ్మీర్‌లో రాహుల్‌ యాత్ర ముగియనుంది. ‘భారత్‌ జోడో యాత్ర’ ముగిసే రోజే ప్రియాంక గాంధీ ‘మహిళా యాత్ర’ మొదలయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు