New Air Force Chief: భారత వాయుసేన చీఫ్‌గా వీఆర్‌ చౌదరి నియామకం

భారత వాయుసేన (ఐఏఎఫ్‌) చీఫ్‌గా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఐఏఎఫ్‌ చీఫ్‌గా ఉన్న ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌కుమార్‌ సింగ్‌ బదౌరియా గురువారం పదవీ విరమణ చేశారు. 

Updated : 01 Oct 2021 00:42 IST

దిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్‌) చీఫ్‌గా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఐఏఎఫ్‌ చీఫ్‌గా ఉన్న ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌కుమార్‌ సింగ్‌ బదౌరియా గురువారం పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో వివేక్‌ రామ్‌ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఐఏఎఫ్‌ ట్విటర్‌ వేదికగా  వెల్లడించింది. ఈ పదవి చేపట్టకముందు వివేక్‌ రామ్‌ చౌదరి పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన వివేక్‌ రామ్‌ చౌదరి.. డెఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్‌ పొందారు. గతంలో వివేక్‌ రామ్‌.. ఎయిర్‌ హెడ్‌ క్వార్టర్స్‌తో పాటు ఫీల్డ్‌ ఫార్మేషన్స్‌లోనూ కీలక పాత్రలు పోషించారు. భారత్‌-చైనాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నప్పుడు భారత వైమానిక భద్రతకు సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహించారు. 1982 డిసెంబరులో ఐఏఎఫ్‌లో చేరిన ఆయనకు మేఘ్‌దూత్‌ ఆపరేషన్స్‌, సఫేద్‌సాగర్‌ ఆపరేషన్స్‌లో ఉపయోగించిన మిగ్ -21, మిగ్-23 ఎంఎఫ్, మిగ్-29, సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 3,800 గంటలకుపైగా ప్రయాణించిన అనుభవం ఉంది. ఆయన కెరీర్‌లో భారత వైమానిక దళానికి చెందిన వివిధ రకాల ఫైటర్, ట్రైనర్ విమానాలను నడిపారు. కేంద్ర సాయుధ బలగాల్లో (సీఏపీఎఫ్‌) డిప్యూటీ కమాండెంట్‌గా, ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఆఫ్ ఎయిర్‌ స్టాఫ్‌ ఆపరేషన్స్‌, పర్సనల్‌ ఆఫీసర్స్‌ విభాగంలో అస్టిస్టెంట్‌ చీఫ్‌గా సేవలందించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని