Anand Mahindra: ఆ దేవాలయం అద్భుతం..కచ్చితంగా చూసొస్తా: ఆనంద్‌ మహీంద్రా

దుబాయ్‌లోని ఓ అద్భుతమైన హిందూ దేవాలయాన్ని ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు. మంగళవారమే దానిని ప్రారంభించారు. ఇండియన్‌, అరబిక్‌ నిర్మాణశైలి ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దారు.

Published : 06 Oct 2022 01:37 IST

ముంబయి: మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర విషయాలేమైనా తన దృష్టి వస్తే సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంటారు. తాజాగా దుబాయ్‌లోని ఓ అద్భుతమైన హిందూ దేవాలయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. మంగళవారమే దానిని ప్రారంభించారు. ఇండియన్‌, అరబిక్‌ నిర్మాణశైలి ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దారు. ‘‘ఈ దేవాలయం అద్భుతంగా ఉంది.ఈసారి దుబాయ్‌ వెళ్లినప్పుడు కచ్చితంగా సందర్శిస్తాను.ఈ అద్భుత కట్టడాన్ని నిన్ననే ప్రారంభించారు.’’ అంటూ రాసుకొచ్చారు. ఇంతకీ ఆ గుడి ఎలా ఉందో మీరూ ఒక్కసారి చూసేయండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని