NEET-PG: నీట్‌-పీజీ పరీక్షను వాయిదా వేయలేం: సుప్రీంకోర్టుకు చెప్పిన ఎన్‌బీఈ

నీట్‌-పీజీ రాసేందుకు 2.09 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. మార్చి 5న జరగాల్సిన ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయలేమని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌బీఈ)..

Updated : 25 Feb 2023 08:32 IST

దిల్లీ: నీట్‌-పీజీ రాసేందుకు 2.09 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. మార్చి 5న జరగాల్సిన ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయలేమని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌బీఈ).. సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘‘పరీక్ష వాయిదావేస్తే సమీప భవిష్యత్తులో ప్రత్యామ్నాయ తేదీ కూడా అందుబాటులో లేదు’’ అని పేర్కొంది. ఈ పరీక్షను 3 నెలలు పాటు వాయిదా వేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌, జస్టిస్‌ దీపంకర్‌ దత్తా ధర్మాసనం శుక్రవారం విచారించింది. వాయిదా వేయకపోతే ఎంత మందిపై ప్రభావం పడుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ల తరఫు న్యాయవాది సమాధానమిస్తూ 45 వేల మంది అని చెప్పారు. ఈ సమస్యకు ఎన్‌బీఈ ఒక పరిష్కారంతో రావాలని కోరుతూ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని