West Bengal: భాజపా ఎంపీ నివాసం వద్ద పేలుడు 

పశ్చిమబెంగాల్‌లో భాజపా ఎంపీ అర్జున్‌ సింగ్‌ నివాసం వద్ద బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. కోల్‌కతాలోని ఎంపీ నివాసం ఇంటిపైకి బుదవారం ఉదయం

Updated : 08 Sep 2021 14:43 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో భాజపా ఎంపీ అర్జున్‌ సింగ్‌ నివాసం వద్ద బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. కోల్‌కతాలోని ఎంపీ నివాసం ఇంటిపైకి బుదవారం ఉదయం బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు మూడు బాంబులు విసిరారు. ఈ ఘటనలో అర్జున్‌ సింగ్‌ ఇంటి గేటు ధ్వంసమవగా.. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఘటన జరిగిన సమయంలో ఎంపీ దిల్లీలో ఉన్నారు. ఈ సాయంత్రం ఆయన కోల్‌కతా వచ్చే అవకాశామున్నట్లు తెలుస్తోంది. దీనిపై భాజపా రాష్ట్ర చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ తీవ్రంగా స్పందించారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఆరోపించారు. అయితే టీఎంసీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. భాజపాలోని అంతర్గత ఘర్షణల కారణంగానే ఈ బాంబు దాడి జరిగి ఉంటుందని ప్రతివిమర్శలు చేసింది. 

అటు రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ కూడా ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో హింస ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ ఉదయం పార్లమెంట్‌ సభ్యుడు అర్జున్‌ సింగ్‌ నివాసం బయట చోటుచేసుకున్న బాంబు పేలుళ్లు.. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై బెంగాల్‌ పోలీసులు సత్వర చర్యలు తీసుకుంటారని విశ్వసిస్తున్నా’’ అని గవర్నర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని