vaccine: టీకాతో మరణించింది ఒక్కరే

జనవరి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకున్న కారణంగా ఒక్క మరణం సంభవించిందని కేంద్రం వెల్లడించింది.

Updated : 16 Jun 2021 11:40 IST

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: జనవరి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకున్న కారణంగా ఒక్క మరణం సంభవించిందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ అడ్వర్స్‌ ఈవెంట్స్‌ ఫాలోయింగ్‌ ఇమ్యునైజేషన్‌ (ఏఈఎఫ్ఐ) కమిటీ నివేదికలో వెల్లడించింది. టీకా తీసుకున్న అనంతరం ఇప్పటి వరకు 31 మందికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురైనట్లు వారు వెల్లడించారు. కాగా వారిలో టీకా రెండు డోసులు తీసుకున్న 68 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు తెలిపారు. మార్చి 8న టీకా మొదటి డోసు తీసుకున్న ఆ వ్యక్తి మార్చి 31న అనాఫిలాక్సిస్‌ రియాక్షన్ కారణంగా మరణించినట్లు ఏఈఎఫ్‌ఐ కమిటీ సలహాదారు ఎన్‌కే అరోరా తెలిపారు. మొత్తంగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పోలిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న వారి సంఖ్య చాలా తక్కువని ఆయన తెలిపారు. మిగిలిన 30 కేసులు టీకాకు సంబంధం లేనివని ఆయన పేర్కొన్నారు. ఆయా సమస్యలకు గల కారణాలు అన్వేషిస్తున్నామన్నారు.

మొత్తంగా టీకా తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల కంటే హాని చాలా తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ తమ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి వచ్చిన గణాంకాల ప్రకారం మిలియన్‌ వ్యాక్సిన్‌లకు మరణాల రేటు 2.7, ఆస్పత్రుల్లో చేరే వారి రేటు 4.8గా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని