Corona Effect: చార్‌ధామ్‌ యాత్ర రద్దు

ఉత్తరాఖండ్‌లో ఏటా జరిగే చార్‌ధామ్‌ యాత్రను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది. రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌

Updated : 29 Apr 2021 13:02 IST

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఏటా జరిగే చార్‌ధామ్‌ యాత్రను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది. రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌ గురువారం ప్రకటించారు. నాలుగు ఆలయాల్లోకి భక్తులెవరినీ అనుమతించేది లేదని, కేవలం అర్చకులే పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. 

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌,యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌లుగా పిలుస్తారు. ఈ ఆలయాలు సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయి ఉంటాయి. వేసవి నుంచి ఆరు నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది మే 14 నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ సారి యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 6వేలకు పైగా కేసులు బయటపడగా.. 108 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని