చైనీయులు యుద్ధం కోరుకోవట్లేదు

భారత్‌, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి  తాము సిద్ధంగా ఉన్నామని చెప్తూనే..కవ్వింపు చర్యలకు పాల్పడి, మనదేశాన్ని చైనా రెచ్చగొడుతూనే ఉంది.

Published : 14 Sep 2020 14:25 IST

ట్విటర్‌లో గ్లోబల్ టైమ్స్‌ సంపాదకుడు

బీజింగ్‌: భారత్‌, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి  తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూనే చైనా కవ్వింపు వ్యాఖ్యలు చేస్తోంది. అలాగే ప్రస్తుత ఉద్రిక్తతలకు భారత్‌ కారణమని పలుమార్లు ఆరోపణలు చేసింది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడంలో ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్‌ది ముఖ్యపాత్ర. దాని ద్వారా హెచ్చరికలు చేస్తూ, భారత్‌ను అదుపులోకి తెచ్చుకోవాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. కాకపోతే వాటికి మనదేశం గట్టిగానే బదులిస్తుంది. తాజాగా గ్లోబల్ టైమ్స్‌ ట్విటర్‌లో చైనా ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదని ఆ పత్రిక సంపాదకుడు హు షిజిన్ చెప్పుకొచ్చారు. మేం సరిగ్గానే వ్యవహరిస్తున్నామని సమర్థించుకొనే ప్రయత్నం చేశారు.

‘చైనా ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ, చైనాకు పోరాడే సత్తా ఉంది. మేం బలంగా ఉన్నాం. మేం సహేతుకంగా వ్యవహరిస్తున్నాం. మా భూభాగాన్ని రక్షించుకోవడంలో ఎలాంటి భయం లేకుండా ఎదురు నిలబడగలం. ఒకనాటికి మేం యుద్ధం చేయకుండానే గెలుపు సాధించగలం’ అంటూ ట్వీట్ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని