
Updated : 22 Jan 2022 22:28 IST
Corona: దిల్లీలో భారీగా కొవిడ్ మరణాలు.. థర్డ్‌వేవ్‌లో ఇవే అధికం!
దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న కేసుల్లో తాజాగా స్వల్పంగా పెరుగుదల నమోదైంది. నిన్నటితో (10,756 కేసులు) పోలిస్తే దాదాపు 7శాతం అధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు, ఈ ఒక్కరోజే 45మంది కరోనా మహమ్మారికి బలైపోవడం కలవరపెడుతోంది. కరోనా థర్డ్ వేవ్‌లో నమోదైన మరణాల్లో ఇవే అత్యధికం. గతేడాది జూన్ 5న ఒక్కరోజులో అత్యధికంగా 68 మరణాలు నమోదయ్యాయి. దిల్లీలో గత 24గంటల వ్యవధిలో 70,226 టెస్టులు చేయగా.. 11,486మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే, కొవిడ్ బాధితుల్లో కొత్తగా 14,802మంది పూర్తిగా కోలుకోగా.. 45మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 58,593కి చేరింది.
ఇవీ చదవండి
Tags :